దుబాయ్ (Dubai).. ఇసుక దిబ్బల దేశం.. కొన్ని సంవత్సరాలకు ముందు వరకు.. అసలు ఇక్కడ మనుషులు జీవిస్తారా.. అన్నే ప్రశ వచ్చేది. ఇప్పుడు దుబాయ్ అంటే స్వర్గం అని అంటారు. అరచేతిలో వేళ్ళ మధ్యలో నుంచి జారిపోయే.. ఇసుక నుంచి.. ఆకాశాన్ని అందే బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) వంటి భారీ భవంతులు వరకు అన్ని అద్భుతాలే.. దుబాయ్ అంత టెక్నలజే.. అక్కడ వర్షం పడటం ఓ వింత గా చెప్పుకుంటారు. అలాంటి దుబాయ్ లో ఇప్పుడు ఏకంగా వరదలతో మునిగిపోయింది.
ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలతో (Heavy Floods) దుబాయ్ లోని చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. వర్షాలు, వరదలతో ఇప్పటికే 18 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందరూ గొప్పగా చెప్పుకునే దుబాయ్ ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. రెండ్రోజుల నుంచి తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం అవుతోంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా భారీగానే సంభవించేది.
వదలకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దుబాయ్ నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ వంటి ఫ్లాగ్‌షిప్ షాపింగ్ సెంటర్‌లతో సహా నగరంలోని కీలకమైన ప్రాంతాలు వరదలతో నిండిపోయాయి. దుబాయ్ మెట్రో స్టేషన్‌లో పాదాల లోతు నీరు నిలిచింది. కనుచూపు మేర నీరు 10 అడుగుల మేర నీరు నిలిచిపోవడం తో వాహనాలు ముందుకు సాగలేక నీళ్లలోనే చిక్కుకుపోయాయి. కార్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలు కాగితపు పడవల్లా నీళ్లలో తేలుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది భారీ వర్షాల కారణంగా విమానాలను దారి మళ్లించారు. దీంతో 100కుపైగా విమానాల రాకపోకలు బంద్ అయ్యాయి.
దుబాయ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, జలప్రళయం గతంలో 75 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని అక్కడి జనం చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికల్లో తమ దీన పరిస్థితి చూపించే విధంగా వర్షాలు, వరదల వీడియోలను షేర్ చేస్తున్నారు. దుబాయ్ వరదల దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
గత సంవత్సరం COP28 UN వాతావరణ సమావేశానికి హాజరైనవారు యూఏఈని ప్రకృతి వైపరీత్యాలు వెంటాడతాయని హెచ్చరించారు. నిజానికి సహజంగా కురవని దేశంలో.. ఇప్పుడు పడ్డ వర్షాలు నిజంగా సహజంగానే కురిసిన వానా.. లేక కృత్రిమ వర్షాలు అని చేప్పబడే.. క్లౌడ్ సీడింగ్ చేశారా.. ప్రశ్న ప్రపంచ దేశల నుంచి వినిపిస్తుంది.
నష్టాలు:
SSM