Sunita Williams , Rodasi Yatra : సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం వాయిదా.. కారణం ఇదేనా..?

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి (American Astronaut) సునీతా విలియమ్స్ (Sunita Villians) రోదసి యాత్ర (Rodasi Yatra) నిలిచిపోయింది. ఆమెను అంతరిక్షంలోకి తీసుకువెళ్లాల్సిన బోయింగ్ స్టారైనర్ ప్రయోగంలో రాకెట్లో సాంకేతికత లోపం తలెత్తడంతో ఈ యాత్ర నిలిచినట్లు నిపుణులు చెబుతున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది.

  • రోదసి యాత్ర నిలిచిపోవడానికి ఇదే కారణం.. ?

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి (American Astronaut) సునీతా విలియమ్స్ (Sunita Villians) రోదసి యాత్ర (Rodasi Yatra) నిలిచిపోయింది. ఆమెను అంతరిక్షంలోకి తీసుకువెళ్లాల్సిన బోయింగ్ స్టారైనర్ ప్రయోగంలో రాకెట్లో సాంకేతికత లోపం తలెత్తడంతో ఈ యాత్ర నిలిచినట్లు నిపుణులు చెబుతున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. ప్రయోగానికి 90 నిమిషాల్లో నింగిలోకి దూసుకెళ్తుందనగా అట్లాస్ వి రాకెట్ లాంచింగ్ ను నిలిపివేశారు. చివరి నిమిషాల్లో రాకెట్ లో గుర్తించిన లోపం కారణంగా ప్రస్తుతానికి ఈ మిషన్ వాయిదా వేస్తున్నట్లు (NASA) ప్రకటించింది. తిరిగి ఎప్పుడు చేపడతారనే వివరాలు ఇంకా వెల్లచడించలేదు. రాకెట్ లో ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ నామమాత్రంగా ఉండడంతోనే ప్రయోగాన్ని రద్దు చేసినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది.

  • నా సొంత ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుంది.. సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసీ యాత్రకు సిద్ధమయ్యారు. విలియమ్స్ తొలిసారి 9 డిసెంబర్ 2006లో వాయేజ్ నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి 22 జూన్ 2007 వరకు ఉన్నారు. నాలుగుసార్లు మొత్తంగా 29 గంటల 17 నిమిషాలు స్పేస్‌వాక్ చేసి రికార్డు సృష్టించారు. రెండోసారి జులై 14 2012లో వెళ్లి నవంబర్ 18 వరకు గడిపారు. 59 ఏళ్ల సునీత మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లనుండడంపై మాట్లాడుతూ..

  • వ్యోమగామి సునీతా విలియమ్స్ రికార్డులు..

ఈ నేపథ్యంలో సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను ఆధ్యాత్మిక వాదిని. గణేశుడు నా గుడ్ లక్ ఛార్మ్. ఆయన విగ్రహాన్ని తీసుకువెళ్తాను. ఇది మొదటి మానవసహిత యాత్ర. దీని గురించి కాస్త ఆందోళనగానే ఉన్నా.. గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదు” అని అన్నారు. ఇప్పటికే ఒకసారి అంతరిక్షంలో 322 రోజులు గడిపిన రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. అంతేకాదు, అత్యధిక గంటలు స్పేస్‌వాక్ చేసిన రికార్డు కూడా ఆమె సొంతం. అంతకుముందు ఈ రికార్డు పెగ్గీ విట్సన్ పేరున ఉండేది. ఈసారి ఆమెతో పాటు మరో వ్యోమగామి విల్మార్ అంతరిక్షయానం చేయనున్నారు. మరొకరితో కలిసి ప్రయాణించిన తొలి మహిళగా రికార్డులకెక్కబోతున్నారు.

Suresh SSM