Japan Tsunami Warning:  జపాన్‌లో భూకంపం.. సునామీ వార్నింగ్‌.. మన మీద ఎఫెక్ట్ ఉంటుందా ?

ప్రపంచం అంతా కొత్త ఏడాది వేడుకల్లో ఉంటే.. జపాన్‌ మాత్రం భారీ భూకంపంతో వణికిపోయింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.  కొన్ని నగరాల వెంబడి సముద్రం నుంచి అలలు ఎగిసిపడుతున్నాయి. సునామీ ఎఫెక్ట్ ఏయే దేశాలపై ఉంటుందనే భయం ప్రపంచమంతటా నెలకొంది.

  • Written By:
  • Updated On - January 1, 2024 / 02:11 PM IST

జపాన్‌లోని నార్త్​ సెంట్రల్​ ప్రాంతంలో సోమవారం 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎంత ప్రాణ, ఆస్థి నష్టం జరిగిందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ భూకంపం కారణంగా.. ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. జపాన్​ పశ్చిమ తీరంలోని ఇషికావా, నైగట, టయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయ్. ఇషికావాలోని నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. అదే ఇషికావాలోని వజిమా నగరంలో ఒక మీటర్​ ఎత్తున్న అలలు తీరాన్ని తాకినట్టు సమాచారం. జపాన్‌ కాలమానం ప్రకారం.. సాయంత్రం 4 గంటల 35 నిమిషాల ప్రాంతంలో.. 80 సెంటీమీటర్ల ఎత్తున్న అలలు.. టయోమా రాష్ట్ర తీర ప్రాంతాన్ని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. యమగట, హ్యోగో ప్రాంతాలవైపు అలలు దూసుకువచ్చాయ్. భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న హొకురికి ఎలక్ట్రిక్​ పవర్​ ప్లాంట్​ సిబ్బంది అలర్ట్ అయ్యారు. న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్‌లో ఏదైనా సమస్యలు ఉన్నాయా అన్నది చెక్​ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక అటు తీర ప్రాంతాల జనాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎవరూ బయటకి రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. జపాన్‌లో భారీ భూకంపంతో భవనాలు, మెట్రో రైళ్లు దారుణంగా షేక్​ అయ్యాయ్. ఆ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​అవుతున్నాయ్. జపాన్‌లో భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో.. మన దగ్గర కూడా భయం మొదలైంది. 16ఏళ్ల కింద ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. సునామీ వణుకు పుట్టించింది. ఆ గాయం నుంచి ఇప్పుడిప్పుడే మర్చిపోతుంటే.. మళ్లీ సునామీ అన్న పదమే వణుకు పుట్టిస్తోంది. సునామీ వస్తే.. ఆ ప్రభావం మన మీద ఉంటుందా అనే భయాలు మన దగ్గర తీరప్రాంత జనాల్లో కనిపిస్తోంది