Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్‌.. ఎంత కష్టమొచ్చె దేవుడా…

ఆయన ఏడ్చాడు.. దేశాన్ని ఏడిపించాడు. ఈ వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకో తెలుసా.. పిల్లన్ని కనండి అని ! దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెప్తూ.. కిమ్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 04:12 PM IST

Kim Jong Un: కిమ్‌ జోంగ్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కిమ్ కాదు కిరాతకమ్‌ అంటుంటారు కొందరు ఆయన పేరు ఎత్తగానే ! అర్థం లేని నిబంధనలు.. జనాల ప్రాణాలు తీసే నియమాలు.. ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆనందించే గుణాలు.. ఇదీ నియంత కిమ్ అంటే. అలాంటి వ్యక్తి బాధపడతాడని.. కన్నీళ్లు పెట్టుకుంటాడని ఎవరైనా ఊహిస్తారా ! కానీ అదే జరిగింది. కిమ్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంట్లో సభ్యుల ముందో, ఒంటరిగానో కాదు.. దేశం మొత్తం ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

REVANTH REDDY: ఆమెకే మొదటి ఉద్యోగం! హామీ నిలబెట్టుకుంటున్న రేవంత్..

ఆయన ఏడ్చాడు.. దేశాన్ని ఏడిపించాడు. ఈ వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకో తెలుసా.. పిల్లన్ని కనండి అని ! దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెప్తూ.. కిమ్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొంతకాలంగా ఉత్తరకొరియాలో జననాల రేటు భారీగా పడిపోతోంది. దీంతో దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి కిమ్ హాజరయ్యాడు. దేశంలోని తల్లులంతా మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్తూ.. ఈ కార్యక్రమంలో కిమ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ప్రసంగం వినగానే సభలో మహిళలు కూడా ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ప్రసంగం మధ్యలో కిమ్‌ కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

కొన్నేళ్లుగా ఉత్తర కొరియా ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. కరోనా సమయం నుంచి.. కిమ్‌ తమ దేశ సరిహద్దులను మూసివేశాడు. ప్రపంచంతో చాలావరకు సంబంధాలు కొనసాగించడం లేదు. దీంతో వ్యాపార, వాణిజ్యాలు సాగక ఆర్థిక సంక్షోభం నెలకొంది. అక్కడ చాలా మంది తిండి, కనీస అవసరాలు తీరక పేదరికంలో మగ్గుతున్నారు. ఇలాంటి సమయంలో మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ తల్లులకు కిమ్‌ సూచించడం హైలైట్‌ అవుతోంది.