Google Layoffs: గూగుల్ లో ఆగని లే ఆఫ్స్ … మళ్ళీ కొందర్ని తొలగిస్తున్న టెక్ దిగ్గజం

ఉద్యోగాల్లో మళ్ళీ కోత పెట్టింది టెక్ దిగ్గజం గూగుల్. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతపై కాస్త వెనక్కి తగ్గినా ... గూగుల్ మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తోంది. ఈమధ్యే సరిగా పనిచేయడం లేదనీ, ప్రవర్తన సరిగా లేదంటూ 50 మందిని ఇంటికి పంపింది గూగుల్. ఇది జరిగి కొన్ని వారాలు కాకముందే మళ్ళీ జాబ్ లే ఆఫ్స్ ప్రకటించింది.

 

 

 

ఉద్యోగాల్లో మళ్ళీ కోత పెట్టింది టెక్ దిగ్గజం గూగుల్. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతపై కాస్త వెనక్కి తగ్గినా … గూగుల్ మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తోంది. ఈమధ్యే సరిగా పనిచేయడం లేదనీ, ప్రవర్తన సరిగా లేదంటూ 50 మందిని ఇంటికి పంపింది గూగుల్. ఇది జరిగి కొన్ని వారాలు కాకముందే మళ్ళీ జాబ్ లే ఆఫ్స్ ప్రకటించింది.

గూగుల్ కి చెందిన పైథాన్, డార్ట్, ఫ్లట్టర్ సహా ఇతర టీమ్స్ కి చెందిన ఉద్యోగులను తీసేస్తోంది. అయితే ఎంతమందిని తొలగిస్తున్నారన్నది మాత్రం ఇంకా బయటపెట్టలేదు. కంపెనీ రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతోందనీ… విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్టు మాత్రం గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు. పని వాతావరణాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకు బ్యూరోక్రసీ, లేయర్లను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లతో పనిచేసే టీమ్స్ ని ఇప్పుడు గూగుల్ తొలగించినట్టు తెలుస్తోంది. వాళ్ళని పూర్తిగా తొలగించడం లేదనీ… కొన్ని బాధ్యతలను తగ్గిస్తున్నట్టు చెబుతోంది గూగుల్.

2024 మొదటి నాలుగు నెలల్లోనే గూగుల్ వందల మంది టెక్ ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాదిలో 12 వేల మంది ఉద్యోగులను వెళ్లిపోవాలని కోరింది. అయితే దశలవారీగా వీళ్ళని తొలగిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇప్పటికే హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చిత ప్రభావం వల్ల… అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల కోతలను ప్రకటిస్తున్నాయి. గూగుల్ బాటలోనే మిగతా కంపెనీలు కూడా చర్యలు తీసుకుంటాయా… అదే జరిగితే భారతీయ ఉద్యోగులకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు.