Mahesh-Venky : పబ్లిక్ గా పేకాట ఆడిన మహేష్-వెంకీ మామ..

ఘట్టమనేని దగ్గుబాటి హీరోలు ఒకే సందడి చేశారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న.. పక్క పక్కన కూర్చొన ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తోంది. సినిమా ఫంక్షన్, ఫ్యామిలీ ఈవెంట్స్ కాకుండా ఒక ఇద్దరు కలిసి.. ఏకంగా గేమ్ కూడా ఆడుకోవడం వైలర్ గా మారింది. ఒకే ఫ్రేం లో చిన్నోడు , పెద్దోడిని చూసి.. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వెంకేటష్(Venky), మహేష్ బాబు (Mahesh) కు సంబంధించిన ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్‌ హీరోలు ఇద్దరు పేకాట ఆడుతూ (played poker) కనిపించిన సీన్‌ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలని చూస్తే.. వీరంతా ఎక్కడో ప్రైవేట్‌ ఫంక్షన్‌లో కలిసినట్లు అర్థం అవుతోంది. వెంకటేష్‌, మహేష్‌ బాబు.. ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని ఉన్నారు. ఇక వారి ముందు డబ్బులు, పేక ముక్కులు ఉన్నాయి. ఈ సీన్‌ చూస్తే.. వీరంతా ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తూ చిల్‌ అవుతున్నారని అర్థం అవుతోంది
ఫోటోను బాగా గమనిస్తే.. మహేష్ వెనుక నిలబడి ఉన్నవారిలో నమ్రతా శిరోద్కర్ కూడా కనిపిస్తున్నారు. అకేషన్ ఏమిటనేది క్లారిటీ లేకపోయినా.. సోషల్ మీడియాలో ఈ పిక్ సెన్సేషన్‌ని మాత్రం క్రియేట్ చేస్తోంది.

స్టార్ హీరోలు (Star heroes) ఇద్దరు ఇలా పబ్లిక్ గా క్లబ్ లో పేకాట ఆడే సాహసం ఎలా చేశారని అందరూ షాక్ అవుతున్నారు. ఆరా తీస్తే.. ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ పార్టీకి వెంకటేష్-మహేష్ హాజరయ్యారు. ఆ పార్టీ కాసేపు సరదాగా పేకాట ఆడారని తెలుస్తోంది. ఆ సమయంలో ఎవరో దూరం నుండి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ అవుతుంది. ఇక మహేష్ బాబుకి సంబంధించి ఈ పిక్‌తో పాటు.. ఆయన ప్రస్తుతం చేస్తోన్న ‘గుంటూరు కారం’ సినిమా నుండి ధమ్ మసాలా సాంగ్ ప్రోమోని వదలడంతో మహేష్ బాబు పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది.