Masood Azahar died: మసూద్ అజహర్ హతం ? బాంబు దాడిలో మృతి ?

మసూద్ అజహర్... ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.  జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు హెడ్ గా వ్యవహరిస్తున్న ఇతను భారత్ లో చేయని అరాచకం లేదు.  ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన ఈ కరుడు గట్టిన టెర్రరిస్ట్... చివరకు అదే ఉగ్రవాదానికి బలయ్యాడు.  

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 08:35 AM IST

భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.  భారత్ లో ఉగ్రవాద దాడులకు కారణమవుతున్న మసూద్ బాంబు దాడిలో మృతి చెందాడని అంటున్నారు. పాకిస్తాన్ మాత్రం ఇంకా ధృవీకరించలేదు. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో భవల్ పూర్ మసీదుకు వెళ్ళి తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై బాంబులతో దాడి చేసినట్టు తెలుస్తోంది. మసూద్ అజాహర్ అక్కడిక్కడే మరణించినట్టు చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  భారత్ లో పార్లమెంట్ పై దాడి, ముంబై పేలుళ్ళు, పుల్వామా ఘటనలతో మారణహోమం సృష్టించిన కిరాతకుడు మసూద్ అజాహర్.  మసూద్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గతంలోనే ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆయన పాక్ లో ఉంటున్నట్టు ప్రపంచం మొత్తానికి తెలుసు.  అప్పుడప్పుడూ సభల్లో పాల్గొంటున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి.  అయినా పాకిస్తాన్ మాత్రం దావూద్ ఇబ్రహీంకి లాగే మసూద్ అజాహర్ ఉనికిని కూడా కాపాడుకుంటూ వస్తోంది.  అందుకే ఇప్పుడు బాంబు దాడిలో చనిపోయినా, పాక్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించే పరిస్థితి లేదు. అయితే పాకిస్తాన్ లో ఇటీవల కాలంలో తరుచుగా వివిధ సంఘటనల్లో టెర్రరిస్టులు చనిపోతున్నారు.

1995లోనే మసూద్ అజహర్ అరెస్ట్

భారత్ లో ఉగ్రవాద దాడుల వెనుక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మసూద్ అజాహర్ హస్తం ఉంది.  జైషే మహ్మద్ అగ్రనేతగా ఉన్న ఇతను… మిగతా చిన్న చిన్న ఉగ్రవాద సంస్థలతో కలసి ఇక్కడ దాడులు చేస్తున్నాడు.  1995లోనే భారత ప్రభుత్వం మసూద్ ను అరెస్ట్ చేసింది.  కానీ 1999లో కాందహార్ విమాన హైజాక్ సంఘటనతో అతడిని విడుదల చేశారు.  2001లో పార్లమెంట్ పై దాడి, 2008లో ముంబై పేలుళ్ళు, 2019లో పుల్వామా ఉగ్రవాద దాడులకు సూత్రధారి మసూద్ అజహర్.  అతడి మరణాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతానికి ధృవీకరించే పరిస్థితి లేకపోయినా…రెండు, మూడు రోజుల్లో భారత్ నిఘా సంస్థలు, సైన్యం నుంచి ప్రకటన వెలువడే ఛాన్సుంది.