జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలి అనే గోల్, దాన్ని రీచ్ అయ్యే డెడికేషన్ ఉంటే చాలు. అంగవైకల్యం కూడా మీ ముందు తల వంచక తప్పదు. ఇదే విషయాన్ని ప్రూవ్ చేసి చూపించాడు మెక్ బాబా అనే పాప్ సింగర్. ఇప్పుడు ఇంటర్నెట్ సింగింగ్ సెన్సేషన్‌గా మారిపోయాడు. ఎవరీ మెక్ బాబా అనుకుంటున్నారా. జస్ట్ ఈ వీడియో చూడండి. ఇతని బ్యాగ్రౌండ్ తెలియకపోయినా ఇంటర్నెట్‌లో ఇతన్ని చూసే ఉంటారు. ఎందుకంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ మెక్ బాబా సాంగ్సే కనిపిస్తున్నాయి. అసలేంటి ఈ సాంగ్ అనేది చెప్పేముందు.. ఎందుకు ఇలా పాడాడు అనేది కూడా చెప్పాలి.
ఇదేదో వెరైటీగా ఉందని ట్రై చేయలేదు. మెక్ బాబా ఈజ్ ఏ డెఫ్ అండ్ డంబ్ ర్యాపర్. అవతలవాళ్ల లిప్ రీడింగ్‌ని బట్టే వాళ్లు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటాడు. నిజానికి బాబా డంబ్ కూడా. కానీ పూర్తిగా కాదు. గొంతుతో సౌండ్ చేయగలుగుతాడు కానీ ఏం మాట్లాడలేదు. మాటలు రాని ఓ వ్యక్తి.. మాటలతోనే పాటలు పాడే ర్యాప్ ఇండస్ట్రీలో ఎదగాలి అనుకోవడం చాలా ఆడ్‌గా ఉంది కదా. కానీ మెక్ బాబా మాత్రం నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ అన్నట్టు దీన్ని ప్రూవ్ చేసి చూపించాడు. అతను పాడిన ఈ సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది. ఈ ఒక్క సాంగ్‌తో ప్రపంచవ్యాప్తంగా తానేంటో తెలిసేలా చేశాడు మెక్ బాబా.. బాబా పాడిన ఈ “ఓకో లేలా యెపా” పాటకు అర్థం మీరు ఎవరికోసం ఏడుస్తారు అని.
మీరు ఎంతో గౌరవించే మీ కన్నీళ్లు సైనికుల కోసం మాత్రమే కార్చండి అని చెప్పడం బాబా ఉద్దేశం. కాంగో సైనికులకు నివాళిగా తన ర్యాప్ సాంగ్‌ను రాసుకున్నాడు బాబా.. కాంగోలోనే పుట్టిన బాబాకు చాలా దేశభక్తి. చిన్నప్పటి నుంచీ ర్యాప్ సింగర్ కావాలి అనే పిచ్చి. మొదట్లో ఒక ట్రూప్‌లో బాబా ఉండేవాడు. కానీ బాబాకు ఉన్న డిసేబిలిటీ కారణంగా ట్రూప్‌లో ఫస్ట్ ప్రియారిటీ ఉండేది కాదు. బట్.. ఆ ట్రూప్‌కు బాబానే స్పెషల్ ఎట్రాక్షన్. ఆ తర్వాత తన సోలో కెరీర్‌ను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాడు బాబా. వెంటనే తానే సోలోగా సాంగ్స్ చేయడం మొదలు పెట్టాడు. తానే లీడ్‌గా చేసిన సాంగే ఈ “ఓకో లేలా యెపా” ఈ సాంగ్ మార్కెట్‌లోకి వచ్చి జస్ట్ 2 వారాలే అవుతోంది. కానీ అప్పుడే మిలియన్స్‌లో వ్యూస్ వచ్చాయ్. ఓ ఫేమస్ ర్యాప్ సింగర్‌కు ఈ రేంజ్‌లో రీచ్ రావడం పెద్ద మేటర్ కాదు. కానీ మెక్ బాబా అలా కాదు. మొన్నటి వరకూ ఎవరికీ పెద్దగా తెలియని పేరు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఒక సెన్సేషన్. తాను పాడిన ర్యాప్‌లో ఉన్న వైబ్ ఒక లెవెల్ ఐతే.. తాను డెఫ్ అయ్యుండి కూడా ర్యాప్ సాంగ్ పాడే ధైర్యం చేయడం మరో లెవెల్. మెక్ బాబా బ్యాగ్రౌండ్ తెలియని చాలా మంది అతన్ని ట్రోల్ చేస్తున్నారు.
ఏదో అటెన్షన్ డ్రాగ్ చేయడానికి ఇలాంటి వింత సౌండ్స్‌తో సాంగ్ చేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ బాబా అసలు ప్రాబ్లం ఇది. నిజానికి ఇలాంటి డిసేబిలిటీ ఉన్నవాళ్లు ర్యాప్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకోవడమే చాలా గొప్ప సాహసం. ఎంత బాగా పాడినా ఏదో కామెంట్ వచ్చే ఈ రోజుల్లో అసలు మాటలే రాకుండా పాటలు పాడటానికి ముందుకు రావడమంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం బాబాకు ఉంది కాబట్టే తన డిసేబిలిటీ కూడా తనముందు తల వంచింది. ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు కాబట్టే.. అన్నీ ఉండి ఏం చేయలేనివాళ్లకు ఓ లెసన్‌గా.. ఏదో సాధించాలి అనుకునేవాళ్లుకు ఓ ఇన్సిపిరేషన్‌గా మారాడు మెక్ బాబా.