US presidential election : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నుంచి వై దొలిగిన మిచెల్ ఒబామా

ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని అధికా డెమోక్రటిక్ పార్టీ,ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా సొంత పార్టీలో బైడెన్ కు నిరసన సెగ తగిలింది. డెమోక్రటిక పార్టీ తరఫున అధ్యక్ష రేసులో డైబెన్ (Joe Biden) పోటీ చేసేందుకు చాలా మంది నేతలు అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.

 

 

 

ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని అధికా డెమోక్రటిక్ పార్టీ,ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా సొంత పార్టీలో బైడెన్ కు నిరసన సెగ తగిలింది. డెమోక్రటిక పార్టీ తరఫున అధ్యక్ష రేసులో డైబెన్ (Joe Biden) పోటీ చేసేందుకు చాలా మంది నేతలు అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. బైడెన్ వృద్దాప్యం, మానసిక ఆరోగ్య స్థితి దృష్ట్యా.. రాస్ ముస్సెన్ రిపోర్ట్స్ సర్వేలో 48శాతం మంది బైడెన్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు వెల్లడయ్యాయి. మరో 33 శాతం మంది బైడెన్ స్థానంలో మరొక అభ్యర్థిని నిలబెట్టాలని సలహా ఇచ్చారు.

దీంతో ఈ ఎన్నికల్లో ఎవరిని అధ్యక్ష బరిలో నిలబెట్టాలని చూస్తున్న సమయంలో.. అమెరికా మాజీ అద్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా (Michelle Obama) వైపే మొగ్గు చూపారు.

ఈ ఏడాదిలో జరగనున్న అమెరికా (America) అధ్యక్ష ఎన్నికల్లో జో డైడెన్ స్థానంలో మిచెల్ ఒబామా పోటీ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కాగా ఈ అధ్యక్ష ఎన్నికలు డొనాల్డ్ ట్రంప్ VS మిచెన్ ఒబామా మధ్య పోటీ రసవంతగా ఉంటుంది అని అనుకుంటున్న సందర్భంలో.. ఒక్క సారిగా మిచెల్ ఒబామా బాంబు పెల్చింది.

తాజాగా ఇదే అంశంపై మాజీ ప్రథమ కార్యాలయం స్పందించింది. మిచెల్ ఒబామా అధ్యక్ష పదవికి పోటీ చేయట్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆమె అభిమానులకు ఇదే చేదు వార్తే.. అధ్యక్షుడు జో బైడెన్,కమలా హరిస్ తిరిగి ఎన్నికల ప్రచారంలో పూర్తగా ఉత్సాహంగా ఉన్నారని తెలిపింది.