Onion prices: భారత్ దెబ్బ.. పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు..

పాకిస్తాన్‌లోని ఉల్లి వ్యాపారులు వివిధ దేశాలకు ఉల్లి ఎగుమతి చేస్తూ.. భారీ ఆదాయం పొందుతున్నారు. అయితే.. పాకిస్తాన్‌కు ఆదాయం పెరగాలి కదా.. అక్కడి నుంచే విదేశాలకు వెళ్తుంటే ఉల్లి ధర ఎందుకు పెరిగిందనే అనుమానాలు రావొచ్చు.

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 08:22 PM IST

Onion prices: ఉల్లి ధరలు పెరిగితే.. సామాన్యుడు ఎంతగా విలవిల్లాడుతాడో తెలిసిందే. అయితే, ఇప్పుడీ పరిస్థితిని పాక్ ఎదుర్కుంటోంది. అక్కడ ఉల్లి ధరలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి ద్రవ్యోల్బణంతోపాటు భారత్ తీసుకున్న నిర్ణయం కూడా ఒక కారణమే. నిజానికి ఇండియా నుంచి పాకిస్తాన్‌కు ఉల్లి ఎగుమతి కావడం లేదు. కానీ, భారత నిర్ణయమే అక్కడి వాళ్లకు శాపమైంది. మన దేశంలో ఉల్లి ధరలు కొంతకాలంగా పెరిగాయి.

Tamilisai Soundararajan: కోదండరామ్‌కు నిరాశ.. నామినేటెడ్ ఎమ్మెల్సీలపై గవర్నర్ సంచలనం..

దీంతో మన ప్రజలకు ఉల్లిని తక్కువ ధరలకే అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్ 8న ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. దీంతో భారత్ నుంచి విదేశాలకు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ఆయా దేశాల్లో ఉల్లికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కువ ధర చెల్లించైనా ఉల్లి కొనేందుకు ఆయా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్‌లోని ఉల్లి వ్యాపారులు వివిధ దేశాలకు ఉల్లి ఎగుమతి చేస్తూ.. భారీ ఆదాయం పొందుతున్నారు. అయితే.. పాకిస్తాన్‌కు ఆదాయం పెరగాలి కదా.. అక్కడి నుంచే విదేశాలకు వెళ్తుంటే ఉల్లి ధర ఎందుకు పెరిగిందనే అనుమానాలు రావొచ్చు. అక్కడి వ్యాపారులు, ఎగుమతి దారులు పాక్‌లో పండిన ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో అక్కడ కొరత ఏర్పడింది. నిజానికి పాక్‌లో ఉల్లి ఉత్పత్తి ఎప్పట్లాగే ఉంది. దిగుబడి తగ్గలేదు. డిమాండ్ కూడా సాధారణమే. కానీ, విదేశాల్లో ఎక్కువ ధర ఉండటంతో వ్యాపారులు విదేశాలకు సరఫరా చేస్తున్నారు.

దీంతో స్థానికంగా కొరత ఏర్పడి ఉల్లి ధర విపరీతంగా పెరిగింది. పాకిస్తాన్ స్థానిక మార్కెట్‌లో ఉల్లి ధర గత నెలలో కిలోకు 150 పాకిస్తానీ రూపాయలు ఉండగా, ఇప్పుడు రూ. 270కి పెరిగింది. భారత్ తీసుకున్న నిర్ణ‍యం పరోక్షంగా పాకిస్తాన్‌లో ఉల్లి ధరలు పెరిగేందుకు కారణమైంది. ఇండియా తర్వాత ఉల్లి అధికంగా పండించే దేశాల్లో పాక్ ఒకటి. మరోవైపు.. పెరిగిన ఉల్లి ధరల కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానిక ప్రభుత్వం ఎగుమతులపై నియంత్రణ చర్యలు తీసుకుంది. అయినప్పటికీ.. అక్కడ ధరలు ఇంకా అదుపులోకి రావడం లేదు.