India, Russia Trip : నేడు రష్యాకు ప్రధాని మోదీ.. రెండు రోజలు పాటు రష్యా పర్యటన..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి రష్యా పర్యటనకు వెళ్తున్నారు. నేడు, రేపు (జులై 8-9) రెండు రోజుల రష్యాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి రష్యా పర్యటనకు వెళ్తున్నారు. నేడు, రేపు (జులై 8-9) రెండు రోజుల రష్యాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. కాగా ఇదివరకే.. 22వ భారత్-రష్యా వార్షిక సదస్సుకు రావాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయన్ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎం నేడు రష్యా రాజధాని మాస్కోకు చేరుకుని రేపటి వరకు అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి రేపు సాయంత్రం ఆస్ట్రియాకు వెళ్లనున్నారు. భారత పీఎం ఆస్ట్రియాలో పర్యటించడం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. కాగా మోదీ రష్యా పర్యటనకు ముందే ఆదేశం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మోదీ పూర్తి స్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైనదని వ్యాఖ్యానించింది.

ఈ పర్యటనను పాశ్చాత్య దేశాలు అసూయతో చూస్తున్నాయంటూ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ శిఖరాగ్ర స్థాయి చర్చలు చేపడతారని వెల్లడించింది. ఈ మేరకు రష్యా అధికార టీవీ ఛానల్ వీజీటీఆర్‌కే కు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. రష్యా-భారత్ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించినవని అన్నారు. రష్యాలో ప్రధాని మోదీ కార్యక్రమం విస్తృతంగా ఉంటుందని, ఇరు దేశాల అధినేతలు చర్చలు జరుపుతారంటూ పుతిన్ ప్రెస్ సెక్రటరీ పెస్కోవ్ పేర్కొన్నారు. మరోవైపు పీఎం నరేంద్ర మోదీ భారత, ఆస్ట్రియా వ్యాపారవేత్తలను ఉద్దేశించి, ఆస్ట్రియా ఛాన్సలర్‌ లో ప్రసంగించనున్నారని తెలిపింది.

ఉక్రెయిన్ – రష్య యుద్దం తర్వాత మోదీ తొలి పర్యటన..

కాగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఉక్రెయిన్ – రష్యా మధ్య చర్చలు చర్చించే అవకాశం ఉంది. మరో వైపు ప్రపంచ సమస్యలపై భారత్ – రష్యా పరస్పరం చర్చించనున్నారు. చివరిగా రష్యా ప్రధాని 2021 న్యూఢిల్లీ వేదికగా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి వచ్చారు. మళ్లీ దాదాపు 3 ఏళ్ల తర్వాత వ్లాదిమిన్ పూతిన్ భారత్ కు రానున్నారు. ఈ సమావేశంలో దేశాల మధ్య బహుళ సంబంధాలను ఇరువురు దేశాధినేతలు సమీక్షిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటనలో పేర్కొంది. పరస్పర ప్రయోజనాలు, సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకుంటారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో భారత్ పేర్కొంది.