Britain Rachel Reeves : బ్రిటన్ ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్.. బ్రిటిష్ చరిత్రలో తొలి ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్..

2024 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో.. లేబర్ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో లేబర్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన రాచెల్ రీవ్స్‌ బ్రిటన్ నూతన ప్రభుత్వంలో.. లేబర్ పార్టీ ప్రభుత్వంలో కీలక పదవి వరించబోతుంది. అంటే బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రిగా రాచెల్ రీవ్స్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

2024 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో.. లేబర్ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో లేబర్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన రాచెల్ రీవ్స్‌ బ్రిటన్ నూతన ప్రభుత్వంలో.. లేబర్ పార్టీ ప్రభుత్వంలో కీలక పదవి వరించబోతుంది. అంటే బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రిగా రాచెల్ రీవ్స్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నియమిస్తున్నట్లు నూతన PM స్టార్మర్ తెలిపారు. స్టార్మర్ రాచెల్ రీవ్స్‌ను UK యొక్క మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించబోతున్నారు. గతంలో కూడా బ్రిటిష్ చరిత్రలో మొదటి మహిళా ఆర్థిక ఛాన్సలర్ పనిచేశారు.

  • రాచెల్ రీవ్స్ జీవితం.. విద్యా, వృత్తి..

రాచెల్ రీవ్స్ 1979 ఫ్రిబ్రవరి 13న లండన్ లో బోరో ఆఫ్ లెవిషామ్ లో జన్మించింది. రాచెల్ రీవ్స్ పూర్తి పేరు.. “రాచెల్ జేన్ రీవ్స్”. ఆమె బ్రిటిష్ అండర్-14 బాలికల చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచారు. ఆమె న్యూ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్ ( బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ) లో తత్వశాస్త్రం, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రాలను అధ్యయానం చేసింది. రాచెల్ రీవ్స్ మొదటి ఉద్యోగం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ లో పనిచేశారు. ఆమె 2006లో HBOS.. రిటైల్ విభాగంలో పని చేసేందుకు లీడ్స్‌కు వెళ్లింది

  • రాచెల్ రీవ్స్ రాజకీయ రంగ ప్రవేశం..

2005 బ్రిటన్ అధ్యక్ష ఎన్నికల్లో.. పోటీ చేసి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎరిక్ ఫోర్త్ చేతిలో ఓటమిపాలయ్యారు. 2006 ఉప ఎన్నికల్లో కూడా పోటీ ఘోర పరాజయం పాలయ్యారు. 2010 సార్వత్రిక ఎన్నికలలో ఆమె తొలిసారి లేబర్ పార్టీ నుంచి MPగా ఎన్నికయ్యారు. 2010లో ఆర్థిక వృద్ధి లేబర్ పార్టీ ప్రధాన మిషన్ అని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత 2011 నుండి 2013 వరకు ట్రెజరీకి షాడో చీఫ్ సెక్రటరీగా ఎడ్ మిలిబాండ్ షాడో క్యాబినెట్‌లో పనిచేశారు. 45 ఏళ్ల రీవ్స్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో ఎకానమిస్ట్‌గా పనిచేశారు. 2017 నుండి 2020 వరకు బిజినెస్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ స్ట్రాటజీ కమిటీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాత 2020 లో ఆమెను “డచీ ఆఫ్ లాంకాస్టర్‌కి షాడో ఛాన్సలర్‌గా, క్యాబినెట్ ఆఫీస్‌కు షాడో మినిస్టర్‌గా పనిచేశారు. 2024 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లీడ్స్ వెస్ట్ & పుడ్సే నియోజకవర్గాల నుండి ఎంపీగా గెలిచి.. బ్రిటిష్ చరిత్రలో మొట్టమొతటి ఆర్థిక శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టబోతుంది. ఇదే 2024 ఎన్నికల్లో ఆమె సోదరి ఎల్లీ రీవ్స్ కూడా లేబర్ పార్టీ ఎంపీగా గెలిచారు.

  • రాచెల్ రీవ్స్ ట్వీట్..

 

సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలుపుతూ, “లీడ్స్ వెస్ట్ మరియు పుడ్సే పార్లమెంటు సభ్యునిగా తిరిగి రావడం గౌరవం మరియు అదృష్టం. మీరు నాపై నమ్మకం ఉంచారు. మరియు నేను మిమ్మల్ని నిరాశపరచను” అని చెప్పింది.