London, Mayor : లండన్ మేయర్ గా హ్యాట్రిక్ కొట్టిన పాకిస్తాన్ సంతతి సాదిక్ ఖాన్

పాకిస్థాన్ (Pakista) సంతతికి చెందిన 51 ఏండ్ల బ్రిటిష్ (British) పౌరుడు సాధిక్ ఖాన్ వరుసగా మూడోసారి లండన్ మేయర్గా ఎన్నికయ్యి హాట్రిక్ విజయం సాధించారు. లేబర్ పార్టీ (Labor Party) తరఫున పోటీ చేసి తన ప్రత్యర్థి సుసన్ హాల్పై ఆయన భారీ విజయం సాధించారు.

పాకిస్థాన్ (Pakista) సంతతికి చెందిన 51 ఏండ్ల బ్రిటిష్ (British) పౌరుడు సాధిక్ ఖాన్ వరుసగా మూడోసారి లండన్ మేయర్గా ఎన్నికయ్యి హాట్రిక్ విజయం సాధించారు. లేబర్ పార్టీ (Labor Party) తరఫున పోటీ చేసి తన ప్రత్యర్థి సుసన్ హాల్పై ఆయన భారీ విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో సాధిక్కు 43.8 శాతం ఓట్లు వచ్చాయి. కన్జర్వేటివ్ పార్టీకి (Conservative Party) చెందిన అభ్యర్థికి 32.7 శాతం ఓట్లు వచ్చాయి. సాధిక్ ఖాన్ కు 10,88,225 ఓట్లు రాగా.. ప్రత్యర్థికి 8,11,518 ఓట్లు దక్కాయి. 276,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో సాధిక్ ఖాన్ గెలుపొందారు.

కాగా సాధిక్ ఖాన్.. 2016 ఎన్నికల్లో మొదటిసారి గెలిచి బ్రిటన్ రాజధాని న‌గ‌రానికి తొలి ముస్లిం మేయర్ (Muslim Mayor) గా ఎన్నికైయ్యారు. అప్పటి లండన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన.. ప్రత్యర్థి షాన్ బెయిలీని ఓడించి మ‌రీ రెండో సారి లండ‌న్ మేయ‌ర్ (London, Mayor) పీఠాన్ని అధిష్ఠించనున్నారు. లేబర్ పార్టీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన సాదిక్‌ ఖాన్ 55.2 శాతం ఓట్లు సాధించగా, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి బెయిలీకి 44.8 శాతం ఓట్లు వచ్చాయి. ఉపాధి కల్పించడంతోపాఉ లండన్ పర్యాటక ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడంపై దృష్టి సారించ‌నున్న‌ట్లు ఖాన్‌ నొక్కిచెప్పారు. దీంతో ఆయన మూడో విజయం కు ముఖ్యం కారణం ఇదే అని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.