టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ మరో నెల రోజుల్లో మొదలవనుంది. వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనుంది. తాజాగా ఉగ్రవాదుల హెచ్చరికలు రావడం తీవ్ర కలకలానికి గురి చేస్తుంది. అమెరికా, వెస్టిండీస్లో జరిగే టీ20 ప్రపంచకప్ను ఉగ్రదాడి భయం భంబెలెత్తిస్తుంది. దీంతో అప్రమత్తమైన బోర్డు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది.
ఎవరూ భయపడాల్సి అవసరం లేదు..
అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఐసీసీ, వెస్టిండీస్ (West Indies) క్రికెట్ బోర్డు హామీ ఇచ్చాయి. కాగా.. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ తమ దేశంలో నిర్వహించాలని భావిస్తోంది. తాజా ఉగ్ర హెచ్చరికల దృష్ట్యా అది కష్టమేనని ఐసీసీ (ICC) వర్గాలు చెబుతున్నాయి. ‘‘వరల్డ్ కప్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరి భద్రతే మా తొలి ప్రాధాన్యత. ఇందుకు కోసం కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్‌లలో కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి.
టీ 20 ప్రపంచక్ షెడ్యూల్
ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2024కు ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. కాగా తాజా ఉగ్రవాద హెచ్చరికల పట్ట కూడా అప్రమత్తంగా ఉండాలని.. భద్రతపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తుంది. ఈ మెగా ఈవెంట్ జూన్ 1 నుండి జూన్ 29 వరకు నిర్వహించనున్నారు. కాగా ఈ టీ20 ప్రపంచకప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2024లో ఐర్లాండ్‌తో జూన్ 5 నుంచి టీమ్ ఇండియా ప్రపంచ కప్ మ్యాచ్ లను ప్రారంభించనుంది. 2024 జూన్ 9న న్యూయార్క్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan) తో భారత్ తలపడనుంది.
SSM