భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న 12 సార్వత్రిక ఎన్నికల పోలింగ్. కాగా పోలింగ్ రోజు ఉదయం నుంచి బీఎన్ పీ రెండు రోజుల పాటు దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. ఎన్నికల విశ్వసనీయత లేదని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు.. ఓటు వేయకుండా ప్రజలను అడ్డుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ స్వతంత్ర అభ్యర్థి డమ్మీ అభ్యర్థులను ప్రోత్స హించిందని ఆరోపింస్తుంది. కాగా ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలను అధికార పార్టీ ఖండించింది.
నిన్న ఢాకాలో పోలింగ్ అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్ కేంద్రాలు, ఐదు స్కూల్స్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. పోలింగ్ కు ముందు రోజు ఓ రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. కాగా 2023 అక్టోబర్ నుంచి బంగ్లా దేశంలో హింసాత్మక ఘటన మొదలై నేటి వరకు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల కు విఘాతం కలిగించాలనే వరుస ఘటనలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 300 నియోజకవర్గాల్లో 299 నియోజకవర్గాల్లో పోలింగ్ కోనసాగుతుంది.