అమెరికా (America) రాజకీయాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికలు (2024 general election) హీటెక్కుతున్నాయి. గతంలో 2017 నుంచి 2021 వరకు అమెరికాకు 5 ఏళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన డోనాల్ట్ ట్రంప్ (Donald Trump) .. మళ్లీ 2024 అమెరికా సార్వత్రిక ఎన్నికల్లో మరో సారి అమెరికా అధ్యక్షు ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. దీంతో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడుగా ఉన్న జో బైడెన్ సైతం ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరో సారి పోటీకి దిగారు. దీంతో ఇద్దరు వ్యక్తులు అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసిన వారిలో ఎవరు తదుపరి అమెరికా అద్యక్షుడిగా విజయం సాదింస్తారు.. ఎవరు ప్రపంచ పెద్ద హోదాను పొందుతారని సర్వంతం ఉత్కంఠ నెలకొంది.
ఈ పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై అనుకోని రీతిలో కాల్పులు జరగడం.. అందులో ట్రంప్ స్వల్పంగా గాయపడిన.. అయిన ధైర్యంగా కొట్లాడుతాం అంటు యుఎస్ ప్రజలకు సంకేతాలు ఇచ్చారు. ఈ ఘటనతో యూఎస్ అధ్యక్ష రేసులో ఉన్న ట్రంపుపై విషయా అవకాశాలు మరింతగా పెరిగాయి. మరో వైపు.. ట్రంప్ కు పోటీగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడంతో.. అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి అధికారికంగా తప్పుకున్నారు. బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష ఎన్నికల రేసులోకి వచ్చిన కమలా హారిస్ అభ్యర్థిత్వం ఇప్పుడు అధికారికంగా ఖరారు అయింది. ఈ విషయాన్ని కమల Xలో వెల్లడించారు. అధ్యక్ష అభ్యర్థిగా సంబంధిత డాక్యుమెంట్లపై సంతకాలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి ఒక్కరి ఓటు గెలుచుకునేందుకు శ్రమిస్తానని పేర్కొన్న కమల, నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
Today, I signed the forms officially declaring my candidacy for President of the United States.
I will work hard to earn every vote.
And in November, our people-powered campaign will win. pic.twitter.com/nIZLnt9oN7
— Kamala Harris (@KamalaHarris) July 27, 2024