samsung : శాంసంగ్ చరిత్రలోనే అతిపెద్ద సమ్మె.. 3 రోజులు విధులు బహిష్కరణ

శాంసంగ్ ఈ ఎలక్ట్రానిక్స్ కంపెనీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.. నిత్యం మన జెబులో ఉండే ఫోన్ శాంసంగ్ కంపెనీది ఉంటుంది. మన ఇంట్లో నిత్యం చూసే టీవీ శాంసంగ్ కంపెనీ ఉంటుంది.

శాంసంగ్ ఈ ఎలక్ట్రానిక్స్ కంపెనీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.. నిత్యం మన జెబులో ఉండే ఫోన్ శాంసంగ్ కంపెనీది ఉంటుంది. మన ఇంట్లో నిత్యం చూసే టీవీ శాంసంగ్ కంపెనీ ఉంటుంది. మన బెడ్ రూమ్ లో ఉండే ఏసీ కూడా శాంసంగ్ కంపెనీదే ఉంటుంది. ఇలా చాలా రకా రకాల ఎలక్ట్రానిక్ డివైజ్ లు మన నిత్య జీవితంలో ఉంటాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ అనవాలు ఉంన్నాయి. భారత్ తో సహా.. కానీ ఇప్పుడు ఒక్క దేశంలో శాంసంగ్ కు గడ్డు కాలం వచ్చింది అనే చెప్పాలి.

ఇక విషయంలోకి వెళితే..

సౌత్ కొరియాలో శాంసంగ్ కంపెనీకి బిగ్ షాక్ తగిలింది. సౌత్ కొరియాలోని శాంసంగ్ ఉద్యోగులు జీతాలు పెంచాలని ఉద్యమ బాట పట్టారు. కాగా ఈ ఉద్యమం శాంసంగ్ కంపెనీ 55 ఏళ్ల చరిత్రలోనే అతి పెద్ద సమ్మెను ఎదుర్కొంటోంది. జీతం పెంపు, సెలవుల సమయంపై గత నెలలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు యూనియన్ పిలుపునిచ్చింది. దీంతో ఆ దేశ రాజధాని సియోల్‌కు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న హ్వాసోంగ్‌లోని సెమీ కండక్టర్ ప్లాంట్ల బయట దాదాపు 6,500 మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి 3 రోజుల సమ్మెకు దిగారు. కంపెనీకి వచ్చే అదనపు లాభాల్లో నుంచి తమకు రావాల్సిన బోనస్‌, ఏడాదికి ఒకరోజు అదనపు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే స్ట్రైక్‌పై శాంసంగ్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది. కాగా ఈ సమ్మె ఇలాగే కొనసాగితే.. శాంసంగ్ పేరు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉందని వ్యాపార వేత్తలు చెబుతున్నారు.