SRILANKA CRICKET BOARD : ప్రపంచ కప్ లో ఘోరంగా ఓటమి.. శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు

శ్రీలంక క్రికెట్ బోర్డునే (SLCB) రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ కప్ లో వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ బోర్డును రద్దు చేసినట్టు శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింగే తెలిపారు.

ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ లో (ODI WORLD CUP 2023) లో ఘోరంగా విఫలమైన శ్రీలంక జట్టుకు (SRILANKA) అక్కడి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. శ్రీలంక క్రికెట్ బోర్డునే (SLCB) రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ కప్ లో వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ బోర్డును రద్దు చేసినట్టు శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింగే తెలిపారు. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగా ఆధ్వర్యంలో ఓ తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏడుగురు సభ్యుల ఈ ప్యానల్ లో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కూడా ఉన్నారు. బోర్డులో అవినీతి పెరిగిపోయింది. అందువల్ల అందులోని సభ్యులకు పదవిలో ఉండే నైతిక హక్కు లేదని అంటోంది ప్రభుత్వం. అందుకే బోర్డు రద్దు చేసినట్టు చెప్పింది. బోర్డు ఆఫీసుపై అభిమానులు దాడి చేసే అవకాశం ఉండటంతో భారీగా పోలీసులను కూడా మొహరించారు.

Prasidh Krishna: ప్రపంచ కప్‌కు హార్ధిక్ దూరం.. ప్రసీధ్ కృ‌ష్ణకు చోటు..!

2023 వన్డే వరల్ట్ కప్ లో శ్రీలంక ఆటతీరుపై ఆ దేశంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది( IND vs SL). భారత్ టార్గెట్ గా పెట్టిన 358 రన్స్ ను సాధించే క్రమంలో శ్రీలంక జట్టు 55 పరుగులకే కుప్పకూలింది. వరల్డ్ కప్ చరిత్రలోనే నాలుగో అత్యల్ప స్కోర్ రికార్డు చేసిన జట్టుగా నిలిచింది. అంతకుముందు ఆసియా కప్ ఫైనల్ లో కూడా శ్రీలంక జట్టు 50 పరుగులకే కుప్పకూలింది. టీమిండియాతో ఓటమి తరువాత శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి మోహన్ డి సిల్వా రాజీనామా చేశారు. ఆ తెల్లారే కొత్త కమిటీని నియమించింది శ్రీలంక ప్రభుత్వం. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో సోమవారం బంగ్లాదేశ్ శ్రీలంక ( SL vs BAN) మధ్య మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ కంటే ముందే బోర్డు రద్దు నిర్ణయం వెలువడింది.