ఇండోనేషియా (Indonesia) లో విషాదం నెలకొంది. సెంట్రల్ ఇండోనేషియాలో 45 ఏళ్ల మహిళను 16 అడుగుల (5మీటర్లు) కొండచిలువ మింగేసింది. దక్షిణ సులవేసి ప్రావిన్స్లోని కలెమ్పింగ్ గ్రామానికి చెందిన ఫరీదా అనే మహిళ గురువారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. భర్త భార్య అయిన ఫరీదా కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోలేదు.. అక్కడే ఓ ప్రాంతంలో ఆయన భార్యకు సంబంధించిన వస్తువులను గుర్తించాడు. ఆ ప్రాంతంలో గాలించగా, ఓ ప్రాంతంలో ఓ పెద్ద కొండచిలువ కంటపడింది. ఆ కొండచిలువ (python) కడుపు భాగం చాలా పెద్దగా ఉబ్బి ఉండటంతో భర్తకు అనుమానంతో అడవీ శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోగా.. అక్కడ ఉన్న కొండచిలువ పంట భాగాన్ని కొసి చూశారు. ఇక అక్కడేముంది అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు కదా అంది. కొండచిలువ కోయగానే మహిళ తల కంటపడింది. దీంతో ఆ మహిళ తప్పిపోయిన ఫరీదాగా గుర్తించారు. దీంతో కొండచిలువ పొట్ట భాగాన్ని మొత్తం కోయగా.. ఫరీధా పాము లోపల దుస్తులతో చనిపోయి కనిపించింది. ఇటువంటి కొండచిలువలు అక్కడ మాములే అని.. కానీ మనిషి కొండచిలువ మింగేయడం చాలా అరుదుగా జరుగుతుందని అక్కడి అధికారులు.. ప్రజలు చెప్పుకొచ్చారు. కాగా గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయని అక్కడి ప్రజలు వెల్లడించారు. 2023 లో ఆగ్నేయ సులవేసి లోని టాంగ్ గయా జిల్లాలో ఒక రైతు తన పొలంలో 8 మీటర్ల కొండచిలువ చంపి మింగేసింది. 2018లో మునా పట్టణంలో 7 మీటర్ల కొండచిలువ 54 ఏళ్ల మహిళను మింగేసింది. మళ్లీ ఈ సంవత్సరంలో (2024 జూన్ 8) 5 ఏళ్ల మహిళను 16 అడుగుల కొండచిలువ మింగేసింది.