flights theft : 110 రోజుల్లో 200 విమానాల్లో చోరీ.. వీడు మామూలోడు కాదు

బస్సుల్లో ట్రైన్స్‌లో ప్రయాణించేటప్పుడు.. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డులు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. ఇలా.. క్రౌడ్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జేబు దొంగలు తిరుగడం సహజం.

 

 

 

బస్సుల్లో ట్రైన్స్‌లో ప్రయాణించేటప్పుడు.. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డులు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. ఇలా.. క్రౌడ్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జేబు దొంగలు తిరుగడం సహజం. కానీ ఎయిర్‌పోర్ట్స్‌లో ఇలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇదే బెస్ట్‌ ప్లేస్‌ అనుకున్నట్టున్నాడు. రాజేష్‌ కపూర్‌ అనే ఓ దొంగ ఎయిర్‌పోర్టుల్లో దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. 110 రోజుల్లో ఏకంగా 200 సార్లు విమానాల్లో ప్రయాణించి చోరీలు చేశాడు. ఇతగాడి ప్రయాణాలు చూసి ఏ బిజెనెస్‌ మ్యానో లేక పొలిటీషియన్‌ అనుకున్నారు అంతా. కానీ మనోడు చేస్తున్న పని ప్రతీ ఒక్కరినీ షాక్‌ గురి చేసింది. ముందుగా ఫ్లైట్‌ బుక్‌ చేసుకుంటాడు. తాను టార్గెట్‌ చేసిన వ్యక్తి పక్కనే సీట్‌ ఇచ్చేలా క్యాబిన్‌ క్రూను మేనేజ్‌ చేస్తాడు. తోటి ప్రయాణికుడిలా పక్కనే కూర్చుని మాటల్లో పెట్టి బ్యాగులు కొట్టేస్తాడు.

ఇదే మనోడి చోరీ స్టైల్‌. ఇప్పటి వరకూ ఇలా చాలా విమానాల్లో చోరీలు చేశాడు రాజేష్‌. గత నెలలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఓ ప్యాసింజర్‌ బ్యాగ్‌ నుంచి 7 లక్షలు కొట్టేశాడు రాజేష్. అంతకు ముందు ఓ ప్యాసింజర్‌ దగ్గర్నించి 20 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు కాజేసాడు. ఇలా విమానాల్లో చోరీలు చేస్తున్న రాజేష్‌ను రీసెంట్‌గా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌ చేశారు. గతంలో జరిగిన కొన్ని చోరీ కేస్‌లతో ఈ కేసును పోల్చి చూస్తే అసలు విషయం బయటపడింది. గతంలో ఆ చోరీలు చేసింది కూడా రాజేషే. ఆయా కేసుల్లోని సీసీ ఫుటేజ్‌లో రాజేష్‌ ట్రేజ్‌ అయ్యాడు. దీంతో మనోడి దందా మొత్తం బయటకి వచ్చింది. రాజేష్‌కు ఢిల్లీలో రికీ డీలక్స్‌ పేరుతో ఓ గెస్ట్‌ హౌజ్‌ ఉందట. ఇలా విమానాల్లో దోచేసిన డబ్బుతోనే ఆ గెస్ట్‌ హౌజ్‌ కొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక గతంలో ఇదే పని రైళ్లలో చేసేవాడట రాజేష్‌. సేమ్‌ టూ సేమ్‌ స్కిప్ట్‌. టార్గెట్‌ చేసినవాళ్లతోవాటే ట్రైన్‌ ఎక్కడం. పక్క సీటు సంపాదించడం. టార్గెట్‌ నిద్రపోయాక బ్యాగ్‌ తీసుకుని ఉడాయించడం. ఇప్పుడు అదే పనిని కాస్త అప్‌గ్రేడెడ్‌గా చేస్తూ విమానాల్లో చోరీలు చేస్తున్నాడు. చాలా మంది దొంగలు వాళ్లే చాలా తెలివైనవాళ్లు అనుకుంటారు. కానీ ఎప్పుడైనా పోలీసులు వాళ్లకంటే ఓ అడుగు ముందే ఉంటారన్న విషయం రాజేష్‌కు తాను అరెస్ట్‌ అయ్యాకే తెలిసింది. ప్రస్తుతం రాజేష్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ఇంకా ఇలా ఎన్ని దొంగతనాలు చేశాడు అనే విషయంలో కూపీ లాగుతున్నారు. ఇలాంటి దొంగల వల్ల విమానాలు కూడా సేఫ్‌ కాదు అనే భయం పట్టుకుంది చాలా మందికి.