Pakistan : పాకిస్తాన్ కు వెళ్లేది లేదు.. ఐసీసీకి తేల్చి చెప్పేసిన బీసీసీఐ

వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం విషయంలో పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ తగిలింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వెళ్ళేది లేదని బీసీసీఐ తేల్చేసింది.

 

 

వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం విషయంలో పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ తగిలింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వెళ్ళేది లేదని బీసీసీఐ తేల్చేసింది. ఇదే విషయాన్ని ఐసీసీకి స్పష్టంగా తెలిపింది. తమ మ్యాచ్ లను తటస్థ వేదికలో నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహించాలని కోరింది. ఆసియాకప్ సమయంలోనూ హైబ్రిడ్ మోడల్ నే పాక్ క్రికెట్ బోర్డు అనుసరించింది. దీని ప్రకారం భారత్ మ్యాచ్ లు పాక్ లో కాకుండా తటస్థ వేదికలో నిర్వహించాల్సి ఉంటుంది. గత కొన్నేళ్ళుగా పాక్ తో ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో క్రికెట్ సిరీస్ లు ఆడడం లేదు. ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. పాక్ వెళ్ళే విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమని బీసీసీఐ ఇప్పటికే చెప్పినా కేంద్రం కూడా ఏమాత్రం అంగీకరించే పరిస్థితి లేదు. దీంతో ఐసీసీకి బీసీసీఐ ఈ విషయాన్ని తెలుపుతూ తటస్థ వేదికలో మ్యాచ్ లు నిర్వహించాలని కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్ ను విడుదల చేసిన పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది.