Hajj trip : హజ్ యాత్రలో విషాదం.. వడదెబ్బతో 19 మంది యాత్రికులు మృతి..

ముస్లింల పవిత్ర హజ్ యాత్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రపంచ దేశల నుంచి ప్రతి సంవత్సరం ముస్లింలు పవిత్ర హజ్ యాత్రకు వెళ్తుంటారు.

 

 

 

ముస్లింల పవిత్ర హజ్ యాత్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రపంచ దేశల నుంచి ప్రతి సంవత్సరం ముస్లింలు పవిత్ర హజ్ యాత్రకు వెళ్తుంటారు. కాగా ఈ సంవత్సరం కూడా హజ్ యాత్రకు పెద్ద ఎత్తున్న భక్తులు ప్రపంచ నలుమూల నుంచి వచ్చారు.

ఈ యాత్రలో భారీ వడగాలులకు యాత్రికులు తట్టుకోలేక..
ఎండ వేడికి తాళలేక 19 మంది యాత్రికులు మరణించారు. వీరంతా జోర్డాన్, ఇరాన్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. అధికారులు ఎండ నుంచి ఉపశమనం కలిగించే ఏర్పాట్లు చేసినా మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో వైపు ఇదే యాత్రకు వచ్చిన 17 మంది జోర్డాన్ దేశస్తులు తప్పిపోయారు.

ఇక ఈరోజు సోమవారం మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు మక్కాలో అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. హజ్ యాత్రికులు తగిన జాగ్రత చర్యలు పట్టించాలని.. అత్యవసరం అయితే ఆరోగ్య కేంద్రలను సంప్రదించాలని సూచించింది. ప్రస్తుతం మక్కాలో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఎండలకు తాళలేక 240 మంది మరణించారు. కాగా ఎల్లుండితో హజ్ యాత్ర ముగియనుంది.