Malaysia Navy Helicopter : మలేషియాలో రెండు ట్రైనింగ్ హెలికాప్టర్స్ ఢీ.. 10 మంది దుర్మరణం

మలేషియా (Malaysia) దేశంలో రెండు హెలికాప్టర్లు (Helicopter) ఢీకొని 10 మంది దుర్మరణం పాలయ్యారు.

 

 

మలేషియా (Malaysia) దేశంలో రెండు హెలికాప్టర్లు (Helicopter) ఢీకొని 10 మంది దుర్మరణం పాలయ్యారు. మలేషియాలో పట్టణం లుముట్‌లో నౌకాదళ స్థావరం వద్ద మిలిటరీ ప్రదర్శనలో భాగంగా ఈరోజు ఉదయం 09:30గంకు హెలికాప్టర్లతో ఎయిర్ షో నిర్వహించగా.. రెండు మిలిటరీ హెలికాప్టర్లు గగనతలంలో చాపర్ మరొకట రోటర్ ను ఢికొట్టింది. దీంతో రెండు హెలికాప్టర్లు నేల పై కుప్పకూలిపోయాయి. పది మంది ఎస్ నేవీ హెలికాప్టర్లు చనిపోయాయి.

లుముట్‌లోని రాయల్ మలేషియన్ నేవీ (Malaysian Navy), (RMN) బేస్ దగ్గర ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. M503-3 మారిటైమ్ ఆపరేషన్స్ హెలికాప్టర్ (HOM)లో ఏడుగురు సిబ్బంది ఉండగా.. మరొక ఫెన్నెక్ M502-6 సమీపంలోని స్విమ్మింగ్ పూల్‌లోకి దూసుకెళ్లింది. దీంట్లో ముగ్గురు సభ్యులు ఉన్నట్లు సమాచారం..

మే నెలలో 3 – 5వ తేదీల మధ్య జరగనున్న నేవీ డే వేడుకల సందర్భంగా ఈ హెలికాప్టర్లు శిక్షణ తీసుకుంటున్న సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది.

గత నెల మార్చిలో, మలేషియా కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ శిక్షణా విమానంలో మలేషియాలోని అంగ్సా ద్వీపం వద్ద సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్, ఇద్దరు ప్రయాణికులను మత్స్యకారులు గుర్తించి రక్షించారు.

SSM