Harry Potter, War : రష్యా దాడిలో ఉక్రెయిన్ ‘హ్యారీపోటర్’ కోట ధ్వంసం

హ్యారీ పోటర్ (Harry Potter) ఈ పేరుతో మనకు పెద్దగా పరిచయం అక్కర్లేదు అనుకుంటా.. హ్యారీ పోటర్ అనే (ఫిల్మ్ సిరీస్) (Film Series) ప్రతి నలుగురిలో 1 కచ్చితంగా చూసి ఉంటారు. ఇందులో సందేహమే లేదు.. ఇప్పుడు ఇదేందుకు అంటారా.. అయితే మీరు హారీ పోటర్ ఫిల్మ్ సిరీస్ (Harry Potter film series) లో హ్యారీ పోటర్ కోట చూసి ఉంటారు.

హ్యారీ పోటర్ (Harry Potter) ఈ పేరుతో మనకు పెద్దగా పరిచయం అక్కర్లేదు అనుకుంటా.. హ్యారీ పోటర్ అనే (ఫిల్మ్ సిరీస్) (Film Series) ప్రతి నలుగురిలో 1 కచ్చితంగా చూసి ఉంటారు. ఇందులో సందేహమే లేదు.. ఇప్పుడు ఇదేందుకు అంటారా.. అయితే మీరు హారీ పోటర్ ఫిల్మ్ సిరీస్ (Harry Potter film series) లో హ్యారీ పోటర్ కోట చూసి ఉంటారు. అంచం అలాంటి కోటనే ఉక్రెయిన్ దేశంలో ఉంది. కానీ ఇప్పుడు ఆ కోట రష్యా (Russia) భీకర దాడులకు తీవ్రంగా ధ్వంసం అయ్యింది.

దక్షిణ ఓడరేవు నగరమైన ఒడెసాలో ‘హ్యారీ పోటర్ కాజిల్’ గా ప్రసిద్ధి చెందిన ఉక్రెయిన్ భవనంపై సోమవారం రష్యా క్షిపణి (Missile)తో దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య గత మూడు సంవత్సరాలుగా భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.. తాజాగా నేడు ఉక్రెయిన్ లోని నల్ల సముద్ర తీరంలో వద్ద ఉన్న ఒడెస్సా నగరంలో “హ్యారీపోటర్ కోట” (Harry Potter Castle) గా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనాన్ని రష్యా క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది. ‘హ్యారీపోటర్’ సినిమాలోని కోటను పోలిన కోట ఉక్రెయిన్లో ఉంది. ఆ సినిమా పేరిటే దాన్ని పిలుస్తున్నారు. గోతిక్ శైలిలో నిర్మించిన సుందరమైన భవనం ను తాజాగా రష్యా చేసిన దాడిలో ఆ కోట ధ్వంసమైంది. క్షిపణి దాడి తర్వాత హ్యారీ పోటర్ భవనం మంటల్లో కాలిపోయింది. నలుగురు మృతిచెందగా 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భిణి ఉన్నట్లు అధికారులు తెలిపారు. 20 వరకు భవనాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఒడెసాపై గడిచిన కొద్ది వారాలలో అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది ఈ హ్యారీపోటర్’ కోట ధ్వంసం. ఈ దాడిలో ఇస్కందర్ బాలిస్టిక్ క్షిపణిని రష్యా వాడి ఉండొచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేశారు.

మరో వైపు ఈ దాడిలో అమెరికా సరఫరా చేసిన ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ క చెందిన ఆయుధాలున్నట్లు వెల్లడించింది. ఈ క్షిపణి పడిన చోటు నుంచి 1.5 కిలోమీటర్ల వరకు శకలాలు పడినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

SSM