అమెరికాలో రిపబ్లిక్ పార్టీ నుంచి ఈసారి భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి అధ్యక్ష బరిలో ఉండటంతో భారతీయులు సంతోషించారు. బయోటెక్ వ్యవస్థాపకుడైన ఆయన పోటీలోకి దిగి ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి జనం నీరాజనాలు పలికారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడు అయితే ఇండియన్స్ కు ప్రయోజనం ఉంటుందని ఆశపడ్డారు. గత ఏడాది ఫిబ్రవరిలో వివేక్ రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి రేసులో చేరారు. అప్పట్లో ఆయన పొలిటికల్ కెరీర్ గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ లాగే… ఇమ్మిగ్రేషన్ తో పాటు అమెరికా స్థానిక సమస్యలను లేవనెత్తారు. దాంతో రిపబ్లికన్ ఓటర్లు ఆయన్ని ఆదరించారు. గత ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి కారణమైన సంప్రదాయ ఓటు బ్యాంక్ ను రామస్వామి తన వైపుకు తిప్పుకోగలిగారు.
కానీ వివేక్ రామస్వామి అమెరికా ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి తప్పుకున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి తాను అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని నిలిపేస్తున్నట్టు వివేక్ రామస్వామి తెలిపారు. అమెరికా అద్యక్ష రేసు నుంచి వివేక్ తప్పుకోడానికి ప్రధాన కారణం… అయోవాలోని రిపబ్లికన్ కౌకస్ లో జరిగిన ఓటింగ్ లో ఆయనకు నాలుగో స్థానం దక్కడమే అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ కి కాల్ చేసి ఆయన అభినందనలు తెలిపారు వివేక్ రామస్వామి. ట్రంప్ అధ్యక్ష పదవికి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
Maldives Tourism Effect : మాల్దీవులకు రోజుకి 9 కోట్లు నష్టం ! భారత్ తో పెట్టుకుంటే అంతే !!