పశ్చిమాసియా దేశం (West Asian countries) లో యుద్ధ (war) మేఘాలు అలుముకుంటున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, మధ్యలో హెజ్‌బొల్లా, ఇరాన్ (Israel) జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా (Ismail Haniyeh) గత మంగళవారం ఇరాన్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇక హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ డెయిఫ్ (Mohammed Deif) ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ తాజాగా వెల్లడించింది. హమాస్ చీఫ్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇరాన్, దాని మిత్రదేశాలు ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడి చేసే ముప్పు పొంచి ఉంది. ఈ వరుస పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో ఐడీఎఫ్ (IDF) అప్రమత్తమైంది. టెల్ అవీవ్‌కు అండగా ఉండేందుకు అమెరికా నౌకలు, ఫైటర్ జెట్లను పంపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్ పై హమాస్ ఇస్లామిక్ మిలిటెంట్లు మెరుపు దాడులకు పాల్పడి 400 మందికి పైగా మరణించారు. అదే కాకా నిన్న కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5 వేల రాకెట్లు ప్రయోగించింది హమాస్.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ (India) అప్రమత్త అయ్యింది. అక్కడ ఉండే భారతీయులను స్వదేశానికి తిసుకోచ్చేందుకు చర్యలు చేపట్టింది. కానీ అక్కడి నుంచి విమాన సంస్థలు ప్రయాణాలను నిలిపివేశాయి. దీంతో ఇజ్రాయెల్‌లో ఉన్న భారత పౌరులకు మన రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని.. సూచించింది. భారతీయులు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. సురక్షిత ప్రదేశాలకు దగ్గర్లో ఉండాలని పేర్కొంది. ఇప్పటికే దేశ పౌరుల భద్రత కోసం ఇజ్రాయెల్ అధికారులతో సమీక్షలు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
ప్రస్తుతం యుద్ధం గనుక మొదలైతే.. ఆ ప్రభావం భారత్ పై ఆర్థిక ఉబ్బందులు ఉంటాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో భారత్ కు ముడిచమురు సరఫరా ఇబ్బందుల్లో పడుతుందని, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.