కాస్త తెలివితేటలు… మరికొంత చాకచక్యం ఉంటే చాలు యూట్యూబ్ … ఇతర సోషల్ మీడియాల నుంచి లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు కొందరు ఇన్ ఫ్లుయెన్సర్లు. చైనాకు చెందిన ఓ అమ్మాయి సోషల్ మీడియా ద్వారా వారానికి 120 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అది కూడా రోజుకి కేవలం 3 సెకన్ల రివ్యూ పెట్టినందుకే. ఆమె సంపాదన చూసి… అమ్మో అన్ని డబ్బులా… అని నెటిజెన్ల నోరెళ్ళబెడుతున్నారు.
ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రతి రోజూ ఆన్లైన్ వీడియోలను YouTube, Instagram, Facebook లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల్ పోస్ట్ చేస్తున్నారు. చాలామంది ఇదే ఆదాయం మీద బతుకుతున్నారు. కానీ ఈ వీడియోలకు లక్షల్లో వ్యూస్, ఫాలోవర్స్ ఉంటేనే డబ్బులు వస్తుంటాయి. చైనాకు చెందిన జెంగ్ జియాంగ్ మాత్రం సోషల్ మీడియాలో తుఫాను సృష్టిస్తోంది. ఆమె వీడియో పెట్టింది అంటే చాలు… కోట్ల రూపాయలు వచ్చిపడుతున్నాయి. టిక్ టాక్ చైనీస్ వెర్షన్ అయిన డౌయిన్ లో జెంగ్ జియాంగ్ కు 50 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా జియాంగ్ కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. వారానికి ఆమె 14 మిలియన్ డాలర్లు సంపాదిస్తోంది. అంటే మన దాదాపు 120 కోట్ల రూపాయలు. అసలు అన్ని సంపాదించడానికి జియాంగ్ ఏం చేస్తోంది అంటే… తన సోషల్ మీడియా అకౌంట్ లో… బట్టలు లేదంటే ఏవైనా వస్తువుల రివ్యూలు ఇస్తుంది. అయితే ఆమె ఇచ్చే రివ్యూ మూడంటే… మూడు సెకన్లు మాత్రమే ఉంటుంది.
జియాంగ్ లైవ్ స్ట్రీమ్ టైమ్ లో… ఆమెకు హెల్పర్ నారింజ రంగు పెట్టెలను ఒక్కొటి ఇస్తూ ఉంటుంది. అందులో ఉన్న వస్తువులను బయటకు తీసి… కేవలం కొన్ని మిల్లీ సెకన్ల టైమ్ లోనే కెమెరాకు ఫ్లాష్ చేస్తుంది జియాంగ్. ఆ ప్రొడక్ట్ రేటు ఎంత ఉందో చెబుతుంది. ఆ తర్వాత స్క్రీన్ నుంచి వెంటనే తీసేస్తుంది. అంటే ఒక్కో ప్రొడక్ట్ కు మూడు సెకన్లు మాత్రమే రివ్యూ ఇస్తుంది. ర్యాపిడ్ ఫైర్ సిస్టమ్ లో… కేవలం జియాంగ్ ఇచ్చే ఈ మూడు సెకన్ల వీడియోను చూసి ఆమె ఫాలోవర్స్ స్టన్ అయిపోతుంటారు. జెంగ్ జియాంగ్ అందమైన కళ్ళతో మాయాజాలమే చేస్తోంది. అందుకే ఆమెకు కోట్లు వచ్చిపడుతున్నాయి. ఆమె ప్రమోషన్ టెక్నిక్ తోనే ప్రొడక్ట్స్ కూడా చైనా మార్కెట్లో పెద్ద సంఖ్యలో అమ్ముడుపోతున్నట్టు తెలుస్తోంది. అందుకే జియాంగ్ తో ప్రొడక్ట్స్ రివ్యూస్ చేయించుకోడానికి చాలా కంపెనీలు ఎగబడుతున్నాయి.