ఓ పెద్ద యుద్ధం లాంటి ప్రచారం తరువాత ఎట్టకేలకు అమెరికాలో ఎన్నికలు ముగిశాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్.. తప్పుల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుని విజయం సాధించారు. త్వరలోనే రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎక్కబోతున్నారు. అమెరికా ఎన్నికల్లో ఫలితాల చివరి వరకూ కూడా ఎవరు గెలుస్తారు అనే విషయంలో చాలా సస్పెన్స్ నడిచింది. ఎవరు గెలుస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎవరికి వాళ్లు తాము మద్దతిచ్చే వ్యక్తిని గెలిపించుకోవాలని ఓట్లు వేస్తుంటే.. ఓ బాలయ్య అభిమాని మాత్రం బ్యాలెట్ పేపర్లో బాలయ్యకు ఓటు వేశాడు. అమెరికాలో బ్యాలెట్ పేపర్లు మన దగ్గరితో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ఉంటాయి. అక్కడ జాతీయ పార్టీల నుంచి ఉన్న అభ్యర్థులు పేర్లు, గుర్తింపు పొందిన పార్టీ పేర్లు మాత్రమే బ్యాలెట్ పేపర్లలో ఉంటాయి.
ఒక వేళ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న వ్యక్తికి ఓటు వేయాలి అనుకుంటే ఆయన పేరు, పార్టీ రాసేందుకు ఓ కాలమ్ ఖాళీగా ఉంటుంది. ఆ ప్లేస్‌లో మనం ఎవరికి ఓటు వేస్తున్నామో వాళ్ల పేరు రాయొచ్చు. ఈ ప్లేస్‌లో ఓ వ్యక్తి బాలయ్య పేరు రాశాడు. ఆ బ్యాలెట్ పేపర్‌ను ఫొటో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు. అమెరికాలో బాలయ్యకు పడ్డ ఈ ఓట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కొందరు మాత్రం ఈ పని చేసిన వ్యక్తిని తిడుతున్నారు. ఓటు అనేది మన హక్కు అలాంటి హక్కును ఇలా దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదని పోస్ట్‌లు పెడుతున్నారు. కానీ కొందరు మాత్రం ఇదేం అభిమానంరా స్వామీ అంటూ పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఏపీలోనే కాదు.. అమెరికాలో పోటీ చేసిన ఎగబడి మరీ బాలయ్యకు ఓట్లు గుద్దేస్తారేమో అనిపిస్తోంది.