కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా… హెల్త్ బులెటిన్ రిలీజ్ !

కాలుజారి పడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు యశోదా హాస్పిటల్ లో చికిత్స జరుగుతోంది. బాత్రూమ్ లో కాలు జారిపడటం వల్ల ఫ్యాక్చర్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి.

  • Written By:
  • Updated On - December 8, 2023 / 12:02 PM IST

CM REVANTH ON KCR HEALTH : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రమాదానికి గురయ్యారు. ఎర్రవెల్లిలోని తన ఫాం హౌజ్‌లో బాత్‌ రూంకు వెళ్తున్న సమయంలో కేసీఆర్‌ కాలుజారి పడిపోయినట్టు ఆయన సిబ్బంది చెప్తున్నారు. కాలు తొంటికి తీవ్ర గాయం అవ్వడంతో వెంటనే ఆయనను సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు తరలించారు. ప్రైమరీ చెకప్స్‌ చేసిన డాక్టర్లు.. కేసీఆర్‌కు తొంటి ఎముక విరిగినట్టు నిర్ధారించారు.  కేసీర్ కు ఎడమ తుంటికి ఫ్యాక్చర్ అయిందని యశోద డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఆయన కోలుకోడానికి 6-8 వారాల టైమ్ పడుతుందని తెలిపారు. జారిపడటంతోనే గాయం అయినట్టు తెలిపారు.

రేవంత్ ఆరా

కేసీఆర్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు తెలిసిన సమయంలో ప్రజాభవన్‌లో ప్రజా దర్భార్‌ నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిన వెంటనే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యశోద హాస్పిటల్‌ దగ్గర భద్రత పెంచాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చారు. కేసీఆర్‌కు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.  ఎలాంటి సమస్య లేకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో ప్రస్తుతం యశోద హాస్పిటల్‌కు సెక్యూరిటీ పెంచారు పోలీసులు.  మరోపక్క కేసీఆర్‌ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు యశోద హాస్పిటల్‌కు వస్తున్నారు.