కోల్‌కతా డాక్టర్ ఘటన.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 78ఏళ్ల స్వతంత్ర భారతంలో.. ఆడదాని మానం కోసం, ప్రాణం కోసం ఇంకా పోరాడాల్సిందేనా.. మదమెక్కిన కుక్కల్లా దాడి చేసి ప్రాణాలు తీసినా.. న్యాయం కోసం ఇంకా యుద్ధం చేయాల్సిందేనా అంటూ.. దేశం అంతా కన్నీరు పెట్టిస్తోంది. ఆ డాక్టర్ తల్లి వేదనకు అయితే అంతే లేదు. పొద్దునే వస్తా అని ఫోన్‌లో చెప్పిన బిడ్డ.. తెల్లవారేసరికి నగ్నంగా, గాయాలతో విగతజీవిగా పడి ఉండడం చూసి.. ఆ తల్లి ఎలా తట్టుకుందో పాపం. ఓ మృగాడి కామవాంఛకు ఆ యువ డాక్టర్ కలలు చెదిరిపోయాయ్. ఆ తల్లి వేదన ఇప్పుడు ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది. ఆమె కార్చే ప్రతీ కన్నీటి చుక్క.. ఎన్నో సమాధానం లేని ప్రశ్నలను సంధిస్తోంది. ఉపాధ్యాయ దినోత్సవం రోజున.. ఆ యువ డాక్టర్ తల్లి రాసిన లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది..
మమ్మల్ని ఒంటరిని చేసి..
మధ్యలో వదిలేసివెళ్లిపోయిన..
ఆ డాక్టర్ తల్లిని నేను…
ఈ టీచర్స్ డే సందర్భంగా…
నా కుమార్తె తరఫున…
టీచర్లందరికీ సెల్యూట్ చేస్తున్నా…
చిన్నప్పటినుంచి నా బిడ్డది ఒకటే కల…
డాక్టర్ కావాలని ఆరాటపడేది.
తనలో ఆ స్ఫూర్తిని నింపింది మీరే…
మీలాంటి గొప్ప టీచర్ల వల్లే..
తన కలను నెరవేర్చుకోగలిగింది..
నా కూతురు నాకు ఎన్నో చెప్పేది..
తన కలలను నాతో పంచుకునేది..
అమ్మా నాకు డబ్బు వద్దు…
నా పేరు ముందు చాలా డిగ్రీలుండాలి…
సాధ్యమైనంత ఎక్కువమంది రోగులకు…
వైద్యం అందించాలని అంటూ ఉండేది..
ఆ ఘోరం జరిగిన రోజు కూడా..
ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లి…
ఎంతోమంది రోగులకు సహాయం చేసింది…
డ్యూటీలో ఉండగానే హత్య చేశారు…
ఆమె కలలను గొంతునొక్కి చిదిమేశారు.
నా బిడ్డకు న్యాయం కావాలి.. ప్లీజ్..