ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్రమ సంబంధాల విషయంలో వెనుకా ముందు చూడటం లేదు. కొందరు మహిళలు ఈ విషయంలో బరి తెగించడం ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా మాచర్లలో భర్తను భార్య,ప్రియుడు ఇద్దరూ కలిసి హత్య చేసారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం విజయపురిసౌత్ పోలీస్ స్టేషన్ లో మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా,ఎస్ ఐ షేక్ మహమ్మద్ షఫీ విలేకరుల సమావేశం నిర్వహించి ఈ హత్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మాచర్ల మండలం తాళ్లపల్లి లో నివాసం ఉండే ఓర్సు శివయ్య భార్య గాయత్రి కొంత కాలంగా అక్రమ సంబంధం నడుపుతోంది. ఓర్సు శివయ్య(32) స్థానిక పవర్ గ్రిడ్ లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శివయ్య భార్య గాయత్రి కి అదే గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి ఆమ్మోరయ్య తో వివాహం కాకముందే బంధం ఏర్పడింది. వారిద్దరూ పెళ్లిచేసుకుందాం అనుకున్నా పెద్దలు ఒప్పుకోలేదు. గత నెల 30 న అర్ధరాత్రి సమయంలో గాయత్రి , అమ్మోరయ్య లు ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో భర్త శివయ్య పట్టుకున్నాడు.
దీనితో కంగారుపడ్డ గాయత్రి,అమ్మోరయ్య లు శివయ్యను దిండుతో మొహంపై ఉంచి ఊపరి అడకుండ చేసి చంపేశారని పోలీసులు వెల్లడించారు. గుండెపోటు అంటూ చెప్పడంతో అనుమానం వచ్చిన మృతుని తల్లి విజయపురిసౌత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా విజయపురిసౌత్ ఎస్ ఐ షేక్ మహమ్మద్ షఫీ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసారు. హత్య చేసిన గాయత్రి,అమ్మోరయ్య లను కోర్టులో హాజరుపరచి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఈ ఘటనతో మాచర్ల ఒక్కసారిగా ఉలిక్కిపడింది.