Tamil Nadu : నాటుసారా తాగి 13 మంది మృతి.. అధికారులపై సీఎం స్టాలీన్ ఆగ్రహం..

తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో నాటుసారా తాగి 13 మంది మరణించారు. మరో 40 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

 

దక్షిణాది రాష్ట్రం అయిన తమిళనాడులో నాటు సారా తాగి 13 దుర్మరణం పాలయ్యారు. తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో నాటుసారా తాగి 13 మంది మరణించారు. మరో 40 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రోజువారీ కూలీలు కరుణాపురంలో నాటుసారా కొనుగోలు చేసి తాగడంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు, దృష్టి లోపం, విరేచనాలు లాంటి లక్షణాలు బయటపడ్డాయి.

ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 200 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ విచారణకు ఆదేశించారు. కల్లకురిచి కలెక్టర్‌ను బదిలీ చేశారు. ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరితోపాటు మరో 9 మందిని కూడా సస్పెండ్‌ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి.