America Francis Scott Key : అమెరికాలో కుప్పకూలిన 1977 ప్రచీన బ్రిడ్జ్..

అగ్రరాజ్యం అమెరికాలో ప్రచీన బ్రిడ్జి (ancient bridge) కుప్పకూలింది. అమెరికా మేరీల్యాండ్ (maryland) లోని బాల్టిమోరా (baltimore) లోని ప్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ (francis scott key) మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది.

అగ్రరాజ్యం అమెరికాలో ప్రచీన బ్రిడ్జి (ancient bridge) కుప్పకూలింది. అమెరికా మేరీల్యాండ్ (maryland) లోని బాల్టిమోరా (baltimore) లోని ప్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ (francis scott key) మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఓ భారీ నౌక ఈ బ్రిడ్జ్ ని ఢీకొనడంతో కూలిపోయింది. అదే సమయలో ఆ బ్రిడ్జ్ పై ప్రయాణిస్తున్న ఇతర వాహనాలు సైతం నదిలో పడిపోయాయి. ఈఘటన మంగళవారం తెల్లవారు జామున 1.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఓడలో మంటలు చేలరేగి.. నీటిలో మునిగి పోయినట్లు సమాచారం.. ఇక ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద సమయంలో వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాదారులు మృతి చెందే అవకాశం ఉన్నట్లు అంచాన వేస్తున్నారు. అయితే బ్రిడ్జి కుప్ప కూలుతున్న సమయంలో తీసిన పలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

కాగా ఈ బ్రిడ్జి ఢీకొన్న నౌక సింగపూర్ దేశానికి చెందిన డాలీగా అమెరికా ప్రభుత్వం (american government) గుర్తించింది. ఇది శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తున్నట్లు సమాచారం.. కాగా ఈ బ్రిడ్జి 1977లో మేరీల్యాండ్ని బాల్టిమోర్ లో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను నిర్మించారు. అమెరికా జాతీయ గీతం రాసిన వ్యక్తి పేరే.. ఈ బ్రిడ్జికి పెట్టారు.