కెఎల్ రాహుల్ కు రూ.20 కోట్లు తగ్గేదే లేదంటున్న 2 ఫ్రాంచైజీలు

నవంబర్ చివర్లో ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. ఈ సారి వేలంలోకి పలువురు స్టార్ ప్లేయర్స్ రానుండడంతో ఎంత భారీ ధర పలుకుతారన్న దానిపై చర్చ మొదలైంది. లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్ ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే అవకాశం లేదని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

  • Written By:
  • Publish Date - October 4, 2024 / 12:41 PM IST

నవంబర్ చివర్లో ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. ఈ సారి వేలంలోకి పలువురు స్టార్ ప్లేయర్స్ రానుండడంతో ఎంత భారీ ధర పలుకుతారన్న దానిపై చర్చ మొదలైంది. లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్ ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే అవకాశం లేదని ఇప్పటికే వార్తలు వచ్చాయి. గత సీజన్ లో సన్ రైజర్స్ తో మ్యాచ్ సందర్భంగా లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా అందరి ముందే రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం వైరల్ గా మారింది. ఆ తర్వాత నుంచి లక్నో ఫ్రాంచైజీతో రాహుల్ సంబంధాలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. లక్నో జట్టులో కొనసాగేందుకు కెఎల్ రాహుల్ కూడా సిధ్గంగా లేడని తేలిపోవడంతో వేలంలో అతన్ని దక్కించుకునేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య గట్టిపోటీ ఉంటుందని భావిస్తున్నారు.

ఇటు బ్యాటర్‌గా, అటు కెప్టెన్‌గా జట్టుకు ఉపయోగపడే రాహుల్ కోసం ఈ రెండు ఫ్రాంచైజీలు భారీగా వెచ్చించేందుకు సిధ్గంగా ఉన్నట్టు సమాచారం. 20 కోట్లయినా బిడ్ వేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న డుప్లెసిస్ ను ఆర్సీబీ వదిలేయడం ఖాయమైంది. అతని స్థానంలో కెఎల్ రాహుల్ కే పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టును వీడనుండటంతో ఓపెనర్ సేవల కోసం ఆ ఫ్రాంచైజీ రాహుల్ పై కన్నేసింది. కాగా 2022 వేలంలో రాహుల్ 17 కోట్లు పలికాడు. 132 మ్యాచ్ లలో 4 వేలకు పైగా పరుగులు చేసిన రాహుల్ కు ఈ సారి 20 కోట్ల వరకూ పలుకుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.