ప్రజల కోసం …ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం నేతలు చేసే పాదయాత్రల ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోతారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి… చంద్రబాబు కొడుకు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఖర్చు 200 కోట్ల రూపాయల పైచిలుకే.1 ఎలా అంటారా… ఆ పార్టీ నేతలు చెప్తున్న లెక్కలు చూస్తే అర్థం అవుతుంది.
లోకేష్ మొత్తం 400 వందల రోజులు నడవబోతున్నారు. ఆయన పాదయాత్ర కు పార్టీ కి రోజుకి 25 లక్షలు ఖర్చు దాటుతుంటే…లోకేష్ రాడానికి ముందు లోకల్ లీడర్లకు మరో 25 లక్షలు ఖర్చు అవుతోంది. ఒక రకంగా గతం లో చంద్ర బాబు , జగన్ పాదయాత్రలతో పోలిస్తే లోకేష్ కు ఖర్చు కాస్త తక్కువే అవుతుందట. లోకేష్ తో పాటు రోజు కనీసం 2వేల మంది కార్యకర్తలు నడుస్తున్నారు. వాళ్ళకి 3పూటలా భోజనం.., టీలు, టిఫిన్లు…ఇవన్నీ అందిస్తున్నారు. ఇక సొంత సెక్యురిటి, డ్రైవర్లు, అనుచరులు, మీడియా ప్రతినిధులు అందరికి భోజనాలు.. ఇతరత్రా తప్పవుగా. అలాగే వాహనాలు, వాటికి పెట్రోల్ డీజిల్, డ్రైవర్లు ఇదంతా పాదయాత్ర ఖర్చులోకే వస్తుంది. నైట్ హల్ట్ వేస్తే టెంట్లు, కారవన్ ఖర్చు కూడా కలుస్తుంది. నాయకులు, క్యాడర్ వాహనాలు అది కూడా ఖర్చేగా. ఇక మధ్య మధ్య లో సభలు.. సమావేశాలు… నిర్వహణ ఖర్చు కూడా స్థానిక నేతలకే తగులు తుంది. స్థానిక నేతల డ్రైవర్లు, అనుచరులు వాళ్ళు తాగడానికి, తినడానికి ఇవన్నీ దీనిలోకే వస్తాయి.
మొత్తం మీద లోకేష్ పాద యాత్ర కు ప్రత్యక్షంగారోజుకు 25 లక్షలు ఖర్చు ఐతే…పరోక్షంగా మరో 25 తగులుతుంది. మొత్తం కలిపి రోజుకు 50 లక్షలు వరకు ఖర్చు తేలుతుంది. అంటే 400 రోజులకి 200 కోట్లు అన్నమాట. ఈ రోజు లోకేష్ ఒక ఏరియా లో నడుస్తుంటే ఆయన కన్నా ముందే ఒక బృందం తరవాతి గమ్యానికి చేరుకుని అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే రెండు కార్యనిర్వాహక బృందాలు నిరంతరం వర్క్ చేయాలి.
పాదయాత్రలు ఎవరు చేసిన ఇవన్నీ తప్పవు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇంత కన్నా ఎక్కవ కర్చే అయ్యేది. జగన్ సభలకు కెమెరాలు డ్రోన్లు, క్రేన్ లు ఇవన్నీ ఏర్పాటు చేసేవారు. ప్రజా సేవ కోసం మన లీడర్ల ఆరాటం చూడండి. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి మరి జనం సమస్యలు గురించి తెలుసుకుంటున్నారు.