అయోధ్య ప్రపంచంలో ఒకే పేరు.. ఒకటే ఆలయం.. రాముడి జన్మస్థలం.. ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) అయోధ్య రామమందిరానికి (Ayodhya Ram Temple) ప్రతిరోజూ వేల మంది వచ్చి రామ్లల్లాను దర్శించుకుంటున్నారు. ఈరోజు పాకిస్థాన్ (Pakistani) నుంచి 200 మంది సింధీ సంఘం సభ్యులు రామ మందిరాన్ని సందర్శించనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం జరిగే సరయు హారతిలో వారు పాల్గొంటారు. వీళ్ల కోసం అయోధ్యలోని సింధీధామ్ ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీ రామ జన్మభూమి (Shri Ram Janmabhoomi) తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సందర్శిస్తున్న పాకిస్థానీ ప్రతినిధుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిన రామ్ కి పైడి వద్ద వారికి స్వాగతం పలుకుతారు.
పాకిస్థాన్ నుంచి అయోధ్యకు వస్తున్న.. యాత్రికులకు అయోధ్యలోని సింధీ ధామ్ ఆశ్రమం, ఉదాసిన్ ఋషి ఆశ్రమం, శబరి రసోయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం రామ్ కి పైడిలో జరిగే సరయు ఆరతికి కూడా ప్రతినిధి బృందం హాజరవుతారు. అక్కడ చంపత్ రాయ్‌తో పాటు రామ్ మందిర్ ట్రస్ట్ సభ్యులు వారికి స్వాగతం పలుకుతారు. దేశంలోని అనేక సింధీ సంఘాలు వారికి స్వాగతం పలకనున్నాయి. రాయ్‌పూర్‌లోని సంత్ సదా రామ్ దర్బార్‌లోని పీతాదేశ్వరుడు, యుధిష్ఠిర్ లాల్ కూడా వారితో పాటు పాల్గొననున్నారు.
SSM