Jr. NTR’s Devara : దసరా బరిలో దేవర

యంగ్ టైగర్ (Young Tiger) జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), కొరటాల శివ (Koratala Shiva) కాంబోలో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ మూవీ దేవర (Devara) .. ఫుల్​ ఆన్​ యాక్షన్​ మోడ్​లో రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ లుక్‌తో రికార్డుల ఊచ కోత ఖాయమని ఇప్పటికే ఫ్యాన్ప్ ఫిక్సయిపోయారు.

యంగ్ టైగర్ (Young Tiger) జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), కొరటాల శివ (Koratala Shiva) కాంబోలో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ మూవీ దేవర (Devara) .. ఫుల్​ ఆన్​ యాక్షన్​ మోడ్​లో రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ లుక్‌తో రికార్డుల ఊచ కోత ఖాయమని ఇప్పటికే ఫ్యాన్ప్ ఫిక్సయిపోయారు. సూపర్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్పి ఉంది.. అయితే.. దేవర రిలీజ్‌ పోస్ట్‌ పోన్ అంటూ ఈ మధ్య కాలంలో వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌ను కన్‌ఫ్యూజన్‌లో పడేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా దేవర రిలీజ్ వినిపిస్తున్న మరో పుకారు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

రెండు పార్టులుగా దేవర సినిమా విడుదల కానుండగా ఇప్పటికే తొలి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, వీఎఫ్​ఎక్స్​ పనులు పూర్తి చేసుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుందని టాక్ వినిసిస్తోంది.. మరోవైపు ఈ సినిమాలో విలన్​ రోల్​ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఇటీవలే గాయల పాలయ్యారు. దీంతో ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్​కు వచ్చేంత వరకు ఈ సినిమా షూటింగ్​ కూడా లేట్​ అవుతుందంటూ ఇంకొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా దసరాకు రిలీజ్ కానుందంటూ వినిపిస్తున్న వార్తలతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ఫ-2 మూవీ రిలీజ్ లేట్ అవుతుందన్న వార్తలు వినిపించాయి. అయితే.. ఆగస్ట్ లో ఉన్న పుష్ప 2 రిలీజ్ వెనక్కు వెళ్లడం లేదని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంతో.. దేవర మరో డేట్ లోకి వెళ్లినట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రం దసరా బరిలో రిలీజ్ అవుతుంది అంటూ సరికొత్త పుకారు మొదలైంది.. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. దీనిపై అధికారిక క్లారిటీ రానప్పటికీ.. దేవర మూవీ దసరాకే రిలీజ్ కావడం పక్కా అంటూ టాలీవుడ్‌లో జోరుగా టాక్ నడుస్తోంది. మరి.. దీనిపై ఓ క్లారిటీ రావాలంటే మూవీ టీమ్ స్పందించాల్సిందే..