Lok sabha elections: రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం.. 13 రాష్ట్రాల్లో ఎన్నికలు

రెండో దశలో కర్ణాటకలోని 28 స్థానాలకుగాను 14, రాజస్థాన్‌లోని 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 7, అసోంలో 5, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, పశ్చిమబెంగాల్‌లో 3, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 09:25 PM IST

Lok sabha elections: లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ శుక్రవారం జరగబోతుంది. ఏప్రిల్ 26న, 13 రాష్ట్రాల్లోని 89 లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నిక జరగనుంది. రెండో దశలో కర్ణాటకలోని 28 స్థానాలకుగాను 14, రాజస్థాన్‌లోని 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 7, అసోంలో 5, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, పశ్చిమబెంగాల్‌లో 3, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి.

BRS: బీఆర్ఎస్‌కు నామినేషన్‌ విత్‌డ్రా టెన్షన్‌.. ఎవరితో.. ఎందుకు..?

అలాగే దక్షిణాది రాష్ట్రమైన కేరళలో మొత్తం 20 పార్లమెంట్ స్థానాలకు సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో దశలో అందరి దృష్టీ కేరళలోని వయనాడ్‌పై ఉంది. ఎందుకంటే.. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. రెండో విడత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 1,210 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ సీజన్‌లోనే వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, మధుర లోక్‌సభ సీటు నుంచి హేమామాలిని, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ సీటు నుంచి, BJYM నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వీ సూర్య బెంగళూరు సౌత్ నుంచి, కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ లీడర్ కుమారస్వామి మాండ్యా నియోజకవర్గం నుంచి, అమరావతి లోక్‌సభ సీటు నుంచి బీజేపీ తరఫున నవనీత్ రాణా వంటి నేతలు పోటీ పడుతున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 89 స్థానాల్లో బీజేపీ 51 సీట్లు, ఎన్డీఏ మిత్రపక్షాలు ఎనిమిది సీట్లు, కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకుంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అయితే, సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలనుకున్నప్పటికీ.. ఎండల దృష్ట్యా ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.