ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వచ్చే నెలలో జరగనున్నాయి. దీంతో అధికార పార్టీ సీఎం జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ బస్సు యాత్రలు చేస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న విషయం తెలిసిందే.. కాగా సీఎం జగన్ 2024 సార్వత్రిక ఎన్నికలకై వైసీపీ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. కాగా గతంలో 20219 ఎన్నికల్లో సీఎం జగన్ ఏ హామీలు ఇచ్చారు.. వాటిలో ఎన్ని అమలు చేశారు అని పూస గుచ్చినట్లు చేపుకోచ్చారు. దీంతో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సీఎం జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
2024 9 ముఖ్య హామీల (వైసీపీ) మేనిఫెస్టో…
సీఎం జగన్ గతంలో మాదిరి.. ఈసారి కూడా రెండు పేజీల మేనిఫెస్టోనే విడుదల చేశారు. ఇందులో 9 ముఖ్య హామీలను సీఎం జగన్ పొందుపరిచారు.
2024 YCP పూర్తి మేనిఫెస్టో..
వైసీపీ మేనిఫెస్టో విడుదల..
వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.60 వేల నుంచి 1.2 లక్షలకు పెంపు..
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం రూ.45 వేల నుంచి 1.05 లక్షలకు పెంపు..
అమ్మఓడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు …
#APElections #Manifesto #YCP #CMJagan #YSRCP #TDP #Chandrababu #2024GeneralElections pic.twitter.com/8dAPYd2oqF
— Dial News (@dialnewstelugu) April 27, 2024
వైఎస్సార్ పెన్షన్ కానుకను రెండు విడతల్లో రూ.3,500కు పెంచుతామని జగన్ ప్రకటించారు.జనవరి 1, 2028న రూ.250, జనవరి 1,2029న మరో రూ.250 పెంచుతామని జగన్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం పెన్షన్ నెలకు రూ.3,000 వస్తోందని, 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని జగన్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తామే ఎక్కువ మందికి, ఎక్కువ మొత్తం ఇస్తున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అమ్మఒడి పథకం కింద ఇచ్చే నగదును రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని సీఎం జగన్ తెలిపారు. ఇందులో స్కూల్ బాగోగుల కోసం రూ.2 వేలు కేటాయించి, మిగతా రూ.15 వేలను తల్లుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. వైఎస్ఆర్ చేయూత కొనసాగిస్తామని.. ఐదేళ్లలో రూ.1,50,000 వరకు పెంచుతామన్నారు. కాపునేస్తాన్ని రూ.1,20,000 వరకు, ఈబీసీ నేస్తం రూ. లక్షా ఐదు వేల వరకు పెంచుతామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.
దేశ చరిత్రలో తమ వైసీపీ పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం జగన్ అన్నారు. ‘కొవిడ్తో ఆర్థిక పరిస్థితి కుదేలైనా రాష్ట్రంలో ఏఒక్క పథకాం కూడా ఆపలేదు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మరో 15 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం ఉండాలి. 2014లో ఇదే కూటమి ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మారు. ఆ హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు బతుకులు ఛిన్నాభిన్నం అయ్యాయి. చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా? ప్రత్యేక హోదాను అమ్మేశారు’ అని చంద్రబాబుపై సీఎం జగన్ దుయ్యబట్టారు.
ఏపీ మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబులా నేను అబద్దపు హామీలు ఇవ్వాలని అనుకోవడం లేదు.. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి నిష్ఠగా అమలు చేశామని CM జగన్ తెలిపారు. ‘ప్రతి ఇంట్లో మా మేనిఫెస్టో ఉంది. 2019 మేనిఫెస్టోలో 99% పైచిలుకు హామీలను అమలు చేశాం. వీటి అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారు. కానీ సాధ్యం చేసి చూపించాం. చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయాలనుకోలేదు. చేయగలిగిన హామీలనే ప్రకటించి నిజాయితీగా అమలు చేశాం’ అని తెలిపారు.
SSM