Bengalore Water crises : నీళ్ళు వృధా చేశారని 22 కుటుంబాలకు జరిమానా !

అసలే తాగడానికి...స్నానాలు చేయడానికి నీళ్ళు లేవని బాధపడుతుంటే... వేస్ట్ చేస్తారా... అంటూ 22 కుటుంబాలకు (22 Families) ఫైన్ విధించింది బెంగళూరు వాటర్ బోర్డు (BWSSB). తాగే నీటిని కార్లు కడగడానికి, తోటలో మొక్కలకు పోశారంటూ ఒక్కో కుటుంబానికి 5 వేల రూపాయల చొప్పున ఫైన్ వేసింది.

అసలే తాగడానికి…స్నానాలు చేయడానికి నీళ్ళు లేవని బాధపడుతుంటే… వేస్ట్ చేస్తారా… అంటూ 22 కుటుంబాలకు (22 Families) ఫైన్ విధించింది బెంగళూరు వాటర్ బోర్డు (BWSSB). తాగే నీటిని కార్లు కడగడానికి, తోటలో మొక్కలకు పోశారంటూ ఒక్కో కుటుంబానికి 5 వేల రూపాయల చొప్పున ఫైన్ వేసింది.

బెంగళూరు (Bangalore) లో నీళ్ళకు జనం అరిగోస పడుతున్నారు. భూగర్భ జలాలు (Ground water) ఎండిపోవడంతో తాగడానికి నీళ్ళు దొరకడం లేదు. వాటర్ బోర్డు (Water Board) అధికారులు కూడా అతికష్టమ్మీద మూడు, నాలుగు రోజులకోసారి నీటిని వదులుతున్నారు. సిలికాన్ సిటీ (Silicon City) లో రోజుకు 500 మిలియన్ లీటర్ల నీటి కొరత ఉంది. ప్రతి రోజూ నగరానికి 2600 మిలియన్ లీటర్లు అవసరం ఉన్నట్టు వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు.

నీటిని తాగడానికి, ఇంట్లో అవసరాలకు మాత్రమే వాడుకోవాలని షరతు పెట్టారు వాటర్ బోర్డు అధికారులు. ఎవరైనా కార్లు, ఇళ్ళు కడిగినా, ఇంటి నిర్మాణాలకు వాడినా, ఆటలాడుకోడానికి నీళ్ళు ఉపయోగించినా… గార్డెనింగ్ చేస్తూ మొక్కలకు నీళ్ళు పోసినా… చర్యలు తీసుకుంటామని వాటర్ బోర్డు అధికారులు హెచ్చరించారు. అయినా లెక్కచేయకుండా మొక్కలకు నీళ్ళు పోస్తూ, కార్లు కడుగుతూ వేస్ట్ చేసిన 22 కుటుంబాలకు ఫైన్ వేశారు. ఒక్కో కుటుంబానికి 5 వేల రూపాయల చొప్పున లక్షా 10 వేలను వసూలు చేశారు. బెంగళూరు సదరన్ రీజియన్ నుంచి అత్యధికంగా 80 వేల రూపాయల దాకా వసూలు చేశారు. హోలీ రోజున కూడా నీటి వాడకాన్ని నిషేధించారు బెంగళూరు మెట్రోవాటర్ బోర్డు అధికారులు. కావేరీ నీటిని కానీ, బోర్ వెల్ వాటర్ కూడా ఏదీ హోలీ కోసం వాడవద్దని వార్నింగ్ ఇచ్చారు. నీటి కొరత కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. షాపింగ్ మాల్స్ లో తినడానికి, టాయిలెట్స్ కి డిస్పోజబుల్ వస్తువులు వాడాలని కండిషన్ పెట్టారు.