మూడోసారి తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో మాజీ సీఎం కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లను కొనుగోలు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి రాగానే ధగ ధగ మెరిసే ఈ 22 కార్లతో మూడోసారి సీఎం హోదాలో తిరగాలని కలలు కన్నారు కేసీఆర్. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. అయితే ఈ 22 కార్ల విలువ ఎంత ఉంటుందని అందరూ సెర్చ్ చేస్తున్నారు… వాటి విలువ 66 కోట్లు… అంతే ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయిందో దీన్నిబట్టి అర్థమవుతోందని కామెంత్ చేస్తున్నారు నెటిజెన్స్.
మూడోసారి తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో మాజీ సీఎం కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లను కొనుగోలు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ కార్లను కొనుగోలు చేసి విజయవాడలో దాచి ఉంచారన్నారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టి… బీఆర్ఎస్ ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సీఎం పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి… పాత కాన్వాయ్ నే కంటిన్యూ చేశారు. తన సొంత కారులోనే ప్రయాణం చేస్తున్నారు. దాంతో ఆ 22 కార్లు విజయవాడలోనే ఉండిపోయాయి. రేవంత్ రెడ్డి సీఎం అయిన పది రోజుల దాకా కూడా ఈ కార్ల సంగతి ఆయన దృష్టికి రాలేదట. కాన్వాయ్ లో పాత బండ్లే అడ్జెస్ట్ చేయండని చెబితే… అప్పుడు అధికారులు 22 కార్ల గురించి బయటపెట్టారట. జనం సొమ్మును కేసీఆర్ ఎలా వృధాచేశారో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
సీఎంగా అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్… ఈ 22 కార్లు కొన్నారు. వీటిల్లో 20 కార్లకు బులెట్ ప్రూఫ్, శాటిలైట్ టెక్నాలజీ లాంటి హంగులు అమర్చి ఉంచారు. 2023 ఏప్రిల్, మే నెలల్లో దశలవారీగా ఇవి ప్రత్యేక కార్గో విమానం ద్వారా విజయవాడకు దగ్గర్లోని వీరపనేని గూడెం ఇండస్ట్రియల్ పార్క్ కు వచ్చాయి. అక్కడ త్రిహాయని ఇంజినీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ… ఈ ల్యాండ్ క్రూయిజర్లకు అధునాతన హంగులు అమర్చింది. ఇండియన్ ఆర్మీ వాడే వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ ని అమర్చేది కూడా ఈ సంస్థే. ఈ ల్యాండ్ క్రూయిజర్ కార్లకు ఉపగ్రహంతో లింకేజ్ ఉంటుంది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో లోపల ఏర్పాటు చేసిన స్క్రీన్లపై చూడొచ్చు. బుల్లెట్ ప్రూఫ్ కూడా ఉంది.
Mutthi Reddy Yadagiri Reddy : కేటీఆర్ పై రగిలిపోతున్న ముత్తిరెడ్డి..!
అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ కార్లను కంపెనీ డెలివరీ చేయాల్సి ఉంది. కానీ త్రిహాయని ఇంజినీరింగ్ సంస్థలో జాయింట్ వెంచర్ అయిన జపాన్ ఈమధ్యే వైదొలిగింది. దాంతో కొత్త ప్రభుత్వం వచ్చాక… 66 కోట్ల విలువైన ఆ 22 కార్లు డెలివరీకి సిద్ధం చేసింది కంపెనీ. ప్రజల సొమ్ముతో కొన్న ఆ కార్లను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. కానీ భద్రత పేరు చెప్పుకొని ఆడంబరాలకు పోవడం సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఆయన పాత కాన్వాయ్ నే కంటిన్యూ చేస్తున్నారు. పైగా తన కోసం ఎక్కడా ట్రాఫిక్ ని నిలిపివేయొద్దని కూడా చెప్పారు. సామాన్య జనంతో పాటే ట్రాఫిక్ లో వెళ్తున్నారు. మరి 66 కోట్ల రూపాయల జనం సొమ్ముతో కొన్న ఈ ల్యాండ్ క్రూయిజర్ కార్లను ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది చూడాలి.