టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా దేశవాళీ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో దుమ్మురేపుతున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో బరోడాకు వరుస విజయాలు అందిస్తున్నాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 30 బంతుల్లో 69 పరుగులు సాధించాడు. 4 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగాడు. హార్దిక్ ఊచకోతతో 222 పరుగుల లక్ష్యాన్ని బరోడా చివరి బంతికి ఛేదించింది. గుర్జప్‌నీత్ సింగ్ వేసిన 17వ ఓవర్లో హార్దిక్ విధ్వంసం సృష్టించాడు. ఏకంగా నాలుగు సిక్సర్లు ఒక బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో ఏకంగా 29 పరుగులు చేశాడు. మెగావేలంలో గుర్జప్‌నీత్ సింగ్‌ను సీఎస్కే 2.2 కోట్లు వెచ్చించి తీసుకుంది. హార్థిక్ మెరుపులతో ఈ సీఎస్కే బౌలర్‌కు హార్థిక్ చుక్కలు చూపించాడు.