బీజేపీ (BJP) రాజ్యసభ (Rajya Sabha) ఎంపీ (MP) సీఎం రమేష్ (CM Ramesh) పై ఫోర్జరీ కేసు (Forgery Case) నమోదైంది. 450 కోట్ల రూపాయలను కొట్టేసినట్టు సినీనటుడు తొట్టెంపూడి వేణు ఫిర్యాదుతో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. PCL ఇంటర్ టెక్ (PCL Inter Tech) కన్సార్టియంలో సీఎం రమేష్… వేల కోట్ల రూపాయల స్కామ్ కి పాల్పడినట్టు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కొడుకు భాస్కర్ రావు ఆరోపించారు.
ఉత్తరాఖండ్ (Uttarakhand) లో తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు (Tehri Hydro Project) దగ్గర సివిల్ పనుల కాంట్రాక్ట్ ను PCL సంస్థ దక్కించుకుంది. తెహ్రీ హైడ్రో డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తో 2002లో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత THDCతో పీసీఎల్ కంపెనీకి విభేదాలు తలెత్తాయి. ఈ వ్యవహారం ఢిల్లీ కోర్టుకు చేరింది. PCLకు ఇవ్వాల్సిన మొత్తాన్ని THDC న్యాయస్థానంలో డిపాజిట్ చేసింది. సీఎం రమేశ్ కు చెందిన షెల్ కంపెనీ రిత్విక్ స్వాతికి THDC సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టుగా బోగస్ పత్రాలు సృష్టించి … 450 కోట్లను కొట్టేసినట్టు PCL సంస్థ ఆరోపించింది. ట్రూత్ ల్యాబ్ లో నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షల్లోనూ ఫోర్జరీ జరిగినట్టు నిర్ధారణ అయిందంటున్నారు. దాంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 75 లక్షలకు మించిన నగదు వ్యవహారం కావడంతో ఈ కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడినట్టు కావూరి భాస్కర్ రావు ఆరోపించారు. ఈ ఫోర్జరీకి సంబంధించి CCS ఏపీసీకి స్టేట్‌మెంట్ ఇచ్చినన్నారు. అరగంట పాటు తన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేసినట్టు చెప్పారు.
బోగస్ సబ్ కాంట్రాక్ట్ ఒప్పందాలతో సీఎం రమేష్ వేల కోట్ల స్కాంకి పాల్పడినట్టు కావూరి భాస్కర్ రావు ఆరోపించారు. సీబిఐ ఎంక్వయిరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు.