నేపాల్(Nepal)లో భూకంపం సంభవించడంతో దాదాపు 69 మంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. అర్ధరాత్రి టైమ్ లో భూకంపం రావడంతో చాలా ఏరియాలకు కమ్యూనికేషన్ వ్యవస్థ లేకుండా పోయింది. దాంతో ప్రమాద తీవ్రత తెలియడలం లేదని నేపాల్ అధికారులు చెప్పారు
ASSEMBLY ELECTIONS: కాంగ్రెస్ బాటలోనే బీజేపీ.. ఉచిత పథకాలతో చత్తీస్‌గడ్ మేనిఫెస్టో విడుదల..
శుక్రవారం రాత్రి 11 గంటలు దాటాక రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు US జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 17 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. ఈ భూకంప తీవ్రతకు భారత్‌లో కూడా అనేక ప్రాంతాలు కంపించాయి. 800 కి.మీ దూరంలో ఉన్న ఢిల్లీతో పాటు యూపీ, బిహార్‌లోని ఏరియాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీలో భయానక వాతావరణం కనిపించింది. జనం రోడ్లపై పరుగులు పెట్టారు. ఢిల్లీ, పట్నా, వారణాసి, ప్రయాగ్ రాజ్ లో ప్రకంపనలు వచ్చాయి.
Asaduddin Owaisi: తొమ్మిది స్థానాల్లో ఎంఐఎం పోటీ.. అభ్యర్థుల్ని ప్రకటించిన ఒవైసీ..
నేపాల్ రాజధాని కాఠ్‌మాండూకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతకు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. రుకమ్ జిల్లాలో ఇళ్లు కూలి దాదాపు 35 మంది చనిపోయారు. అలాగే జజర్‌కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాత్రి సమయంంలో భూకంపం రావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆయా ప్రాంతాలకు రెస్క్యూ సిబ్బంది వెళ్ళలేకపోయారు. జనం నిద్రపోతున్న టైమ్ లో భూకంపం రావడంతో ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉంది. భూప్రకంపనలు అటు చైనాలో కనిపించాయి.