విశాఖ తీరంలో ఓ భారీ పురాతన పెట్టె దొరికింది. సుమారు 100 టన్నుల బరువున్న ఆ పెట్టెను అధికారులు జేసీబీ సాయంతో ఒడ్డుకు చేర్చారు. నిన్న రాత్రి నుంచి విశాఖలో ఇదే హాట్ టాపిక్. అసలు ఆ పెట్టె అక్కడికి ఎలా వచ్చింది. ఆ పెట్టెలో ఏముంది. అందరిలో ఇదే క్యూరియాసిటీ. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అధికారులు కూడా స్పాట్‌కు వచ్చి పెట్టెను పరిశీలించారు. ఇది సుమారు 100 ఏళ్ల పురాత పెట్టె అయ్యి ఉంటుందని ఓ అంచనా వేశారు. అంతే అందరిలో ఆసక్తి డబుల్ అయ్యింది. ఇదేదో రాజులకు సంబంధించిన పెట్టె అని అంతా అనుకున్నారు. దీంతో పెట్టెను ఓపెన్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బాంబ్ స్క్వాడ్‌ను కూడా స్పాట్‌కు పిలిపించారు. పెట్టె సైజ్ భారీగా ఉండటంతో జేసీబీ సహాయంతో బాక్స్‌ను పగలగొట్టారు. అందులో ఏముందో చూసి అంతా షాకయ్యారు.
మణులు, మాణిక్యాలు ఉంటాయనుకున్న పెట్టెలో కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ రాళ్లతో పెట్టెను నింపి దాన్ని సీల్ చేశారు. భారీ పడవల్లో అత్యవసర సమయాల్లో లంగర్‌లా ఉపయోగించేందుకు ఇలాంటి వస్తువులను వాడుతుంటారు. ఈ పెట్టెను కూడా అందుకే తయారు చేశారు. ఏదో భారీ పవడ ప్రమాదనికి గురైనప్పుడు ఈ పెట్టె పడవ నుంచి విడిపోయి ఉంటుంది. అదే బాక్స్ ఇప్పుడు అలల ధాటికి విశాఖ తీరానికి కొట్టుకువచ్చింది. ఆ బాక్స్ చూసి నిన్నటి నుంచి అంతా ఎంతో ఆసక్తితో వెయిట్ చేశారు. తీరా అందులో ఏముదో తెలియడంతో పోయాం మోసం అనుకున్నారు.