Nifa Virus : నిఫా వైరస్ తో 14 ఏళ్ల బాలుడు మృతి.. కేంద్రం హై అలర్ట్..

కేరళలో నిఫా వైరస్ 14 ఏళ్ల బాలుడికి సోకిన విషయం తెలిసిందే.. తాజాగా ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మొత్తం ఉలిక్కిపడింది.

కేరళలో నిఫా వైరస్ 14 ఏళ్ల బాలుడికి సోకిన విషయం తెలిసిందే.. తాజాగా ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మొత్తం ఉలిక్కిపడింది.

కేరళలో 14 ఏళ్ల బాలుడికి శనివారం నిఫా వైరస్ సోకి కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.. కాగా ఆ బాలుడు ఆదివారం తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈరోజు ఉదయం నుంచి మూత్రం ఆగిపోయిందని, తీవ్ర తలనోప్పితో.. అనంతరం కాసేపటికే తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. అతని ప్రాణాలు రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించిన చివరికి ఫలితం లేదు. దురదృష్టవశాత్తు ఉదయం 11:30కు బాలుడు మరణించినట్లు తెలిపారు. పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV) ఈ విషయాన్ని నిర్ధారించినట్లు వివరించారు. దీంతో ఆ బాలుడు వద్దకు ఎవరెవరు దగ్గరగా వచ్చారనే దానిపై ఆస్పత్రి వైద్యులు ఆరా తీస్తున్నామన్నారు. ఇక వారిని గుర్తించి వెంటనేవారిని క్వారంటైన్ కు తరలించాలి. ఇక బాలుడు మరణించడంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అతడి అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అంత్యక్రియల విషయంలో బాలుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాగా 2018 నుంచి కేరళలో నిఫా వైరస్ వల్ల 21 మంది చనిపోయారు. గత సంవత్సరంలో 5 మంది మృత్యువాత చెందారు.

Suresh SSM