Nitin Gadkari biopic : వెండితెరపై ప్రముఖ రాజకీయ నాయకుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్..

బీజేపీ ఎంపీ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ జీవితం వెండితెరపై రానుంది. నితిన్ గడ్కరీ పుట్టిన రాష్ట్రం మహారాష్ట్ర నుంచి పారిశ్రామిక వేత్తగా, న్యాయవాదిగా ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గా ఎలా ఎదిగాడు అనే నేపథ్యంలో వస్తుందని చిత్ర వర్గాల్లో టాక్..

భారతీయ చలన చిత్ర రంగంలో కొంత కాలం కిందట బయోపిక్ కాలం నడిచింది. తర్వాత చారిత్రక నేపథ్యంలో, మైథాలజీ ఇలా కొన్ని రోజులు సినిమా వచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ బయోపిక్ కాలం మొదలైంది. ఇది వరకు బయోపిక్ అన్ని కూడా చనిపోయిన వారి జీవిత ఆధారంగా తెరకెక్కిన.. ఇప్పుడు అలా కాదు.. నేటికి యాక్టివ్ గా ఉన్న వారి జీవిత విశేషాలను కూడా బయోపిక్ గా సినిమాలు తీస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రం తెరకెక్కింది. తర్వాత టీమిండియా మహిళా జట్టు పేసర్ జులన్ గోస్వామి బయోపిక్ కూడా తెరకెక్కింది. శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా రూపొందిన ‘800’.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రముఖ క్రీడాకారుల జీవిత చరిత్రలపై వరుసపెట్టి సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల పైనా కూడా సినిమాలు వస్తున్నాయి.

తాజాగా మరో బయోపిక్​ విడుదలకు సిద్ధమవుతోంది.. ఈ బయోపిక్ ఎవరికంటే..?

బీజేపీ ఎంపీ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ జీవితం వెండితెరపై రానుంది. నితిన్ గడ్కరీ పుట్టిన రాష్ట్రం మహారాష్ట్ర నుంచి పారిశ్రామిక వేత్తగా, న్యాయవాదిగా ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గా ఎలా ఎదిగాడు అనే నేపథ్యంలో వస్తుందని చిత్ర వర్గాల్లో టాక్.. దీనికి పార్ట్ 2 కూడా ఉండొచ్చని చిత్ర పరిశ్రమలో చర్చలు. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.. చిత్రం విడుదల అయ్యాక పార్ట్ 2 పై సైరా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా మాత్రం మరాఠిలో తెరకెక్కింది. తెలుగులో వస్తుందో లేదో కూడా సరైన స్పష్టత లేదు.  కాగా గడ్కరీ ఈ బయోపిక్‌కు అనురాగ్‌ రాజన్‌ భూసరి దర్శకత్వం వహించారు. అక్షయ్‌ అనంత్‌ దేఖ్‌ముఖ్‌ నిర్మాతగా వ్యవహరించారు.

గడ్కరీ పాత్రలో హీరో ఎవరు..?

గడ్కరీ బయోపిక్ దగ్గర పడుతున్న హీరో చెప్పని చిత్ర యూనిట్..! సినిమా విడుదలకు 18 రోజుల సమయం మాత్రమే ఉన్నా ఇంకా ఈ సినిమాలో నితిన్‌ గడ్కరీ పాత్ర పోషించిన నటుడి వివరాలను వెల్లడించకుండా సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తోంది చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్రానికి సంబందించి పాస్ లుక్ విడుదల చేశారు కానీ అందులో రహదారీ ని చూస్తు బ్యాక్ షాట్‌లో ఉన్న నితిన్ గడ్కరీ. గడ్కరీ లా నటించింది ఎవరనేది తెలుసుకునేందుకు ప్రేక్షకులు అలాగే బీజేపీ ఎంపీలు బీజేపీ కార్యకర్తలు తెగ తొందర పడుతున్నారు. మరికొన్ని రోజుల్లోనైనా ఆ డిటైల్స్‌ రివీల్‌ చేస్తారా..? అంటే దానికి సరైన సమాధానం దొరకడం లేదు. లేదంటే నేరుగా తెరపై ఆ హీరోని పరిచయం చేస్తారా..? అంటే వేచి చూడాల్సిందే. ఈ చిత్రం అక్టోబర్ 27వ తేదీన విడుదల కానుంది.

S.SURESH