‍Narendra Modi: పార్లమెంట్ సమావేశాల ఎజెండా విడుదల.. అనుకున్న అంశాలేవీ చర్చలోలేవు

పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు అనుకున్నది ఒకటి.. పాలక పక్షం చేస్తోంది ఒకటి అన్న విధంగా జరుగనున్నాయా అంటే.. తాజాగా విడుదల చేసిన బులిటెన్ చూసిన తరువాత అవుననే చెప్పాలి. ఎందుకిలా చెప్పాల్సి వస్తుందో ఈ క్రింది అంశాలను ఒకసారి చదవండి.

  • Written By:
  • Updated On - September 14, 2023 / 08:10 AM IST

గత వారం పది రోజులుగా పార్లమెంట్ సమావేశాలపై అన్ని రాజకీయ పార్టీల్లోనూ చర్చ జోరుగా జరుగుతోంది. ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఏఏ అంశాలు చర్చకు వస్తాయన్న ఆసక్తి చాలా మందిలో నెలకొంది. అసలే ఎన్నికల కాలం. గెలిచేందుకు దోహదపడే అంశాలను తెరపైకి తెస్తారని అందరూ భావించారు. అందరి అంచనాలపై నీళ్లు చల్లుతూ.. తాజాగా పార్లమెంట్ సమావేశాల ఎజెండా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం రాత్రి విడుదల చేసింది పార్లమెంట్ వ్యవహారాల శాఖ.

ఎజెండాలోని అంశాలు ఇవే..

ఈనెల 19 న కొత్త పార్లమెంట్ భవనలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 18 వ తేదీన పాత పార్లమెంట్ ప్రస్థానం గురించి చర్చ జరగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వజ్రోత్సవాలు జరుపుకున్ సందర్భంగా ఈ సభలోని జ్ఞాపకాలు, సాధించిన విజయాలు, ఎదురైన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు, తీసుకొచ్చిన కొత్త అంశాలు, అమలవుతున్న తీరు, చారిత్రాత్మకమైన నిర్ణయాల గురించి చర్చించేలా ప్రణాళికలు సిద్దం చేశారు.

ప్రవేశ పెట్టనున్న బిల్లులు..

  • నూతన పార్లమెంట్ భవనం సాక్షిగా అయిదు కొత్త బిలులను ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
  • ది అడ్వకేట్స్ సవరణ బిల్లు-2023
  • ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023
  • పోస్టాఫీసుల బిల్లు-2023
  • ది ప్రధాన ఎన్నికల కమిషనర్/ ఇతర కమిషనర్ల బిల్లు-2023
  • ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు-2023

A Bulletin Has Been Released

కొన్ని గతంలో పొందుపరిచినవే..

ఆగస్ట్ 3వ తేదీన రాజ్య సభ ఆమోదించిన న్యాయస్థానాలకు సంబంధించిన ది అడ్వకేట్స్ సవరణ బిల్లును తీసుకురానున్నారు. అలాగే ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లును కూడా గతంలో ప్రవేశపెట్టినదిగా తెలుస్తోంది. దీనితో పాటూ ఆగస్టు 10 న రాజ్యసభలో ప్రవేశ పెట్టిన పోస్టాఫీసుల బిల్లుతో పాటూ ది ప్రధాన ఎన్నిక కమిషనర్లకి చెందిన అపాయింట్మెంట్స్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అనే అంశాలతో కూడిన బిల్లును తీసుకురానున్నారు. జూలై 7న లోక్ సభ ఆమెదించిన కొన్ని అవసరం లేని చట్టాలను తొలగించేందుకు ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇందులో కొన్నింటిని రాజ్యసభ ఆమోదించింది. వాటిని తిరిగి లోక్ సభలోకి తెచ్చి పాస్ చేయనున్నారు.

ఉన్నపళంగా సరికొత్త బిల్లులు చర్చకు వస్తాయా..

పార్లమెంట్ సమావేశాలు త్వరలో జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ  మంత్రి ప్రహ్లాద్ జోషి గత నెల31న తేదీని ప్రకటించారు. అయితే ఏ అంశం మీద జరుగుతుంన్న ఉత్కంఠకు ఈ బులిటెన్ కాస్త అడ్డుకట్ట వేసినప్పటికీ మరిన్ని అంశాలు వెలుగులోకి రానున్నాయని అంచనా వేస్తున్నాయి ప్రతి పక్షాలు. జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, ఉమ్మడి పౌరస్మృతి, జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా, ఓబీసీ రిజర్వేషన్లు వంటి అంశాలను తీసుకొస్తారని భావించినప్పటికీ ఇందులో ఏ ఒక్కదానికి అవకాశం ఇవ్వకుండా బులెటిన్ విడుదల చేయడం కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఎజెండాలో ప్రకటించనప్పటికీ అప్పటికప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. దీనికి కారణం గతంలో ఆర్టికల్ 370 బిల్లును కూడా అలాగే తెచ్చారని అభిప్రాయపడుతున్నారు. నరేంద్రమోదీ ఏ నిర్ణయం అయినా అకస్మాత్తుగా తీసుకుంటారని విశ్లేషిస్తున్నారు.

T.V.SRIKAR