Seemla Bus Accident : హిమాచల్‌ప్రదేశ్‌‌లో లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి

హిమాలయ రాష్ట్ర అయిన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో ఘోర బస్సు (Bus Accident) ప్రమాదం చోటు చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెందిన బస్సు సిమ్లా (Shimla) లోని రోహ్రు ప్రాంతంలో గల కుద్దు నుంచి దిల్తారీకి వెళ్తోంది.

హిమాలయ రాష్ట్ర అయిన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో ఘోర బస్సు (Bus Accident) ప్రమాదం చోటు చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెందిన బస్సు సిమ్లా (Shimla) లోని రోహ్రు ప్రాంతంలో గల కుద్దు నుంచి దిల్తారీకి వెళ్తోంది. ఈ క్రమంలో జుబ్బల్‌లోని కెంచి ప్రాంతంలోకి రాగానే బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘోర బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌, ఓ మహిళ, నేపాలీ జాతీయుడు మృతి చెందినట్లు గుర్తించారు. వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు.

కాగా ఈ ప్రమాదంలో మృతుల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. అందులో ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. మరి కొందరు ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరికొందరు చికిత్స పొందుతు మరణించినట్లు ఎస్ డీఎం రాజీవవ్ నమ్రాన్ వెల్లడించారు. ఆ సమయంలో బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదని.. కాగా ఈ బస్సు ఎలా బోల్తా పడింది అన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.