భగవద్గీత వీడియో, బిత్తిరి సత్తికి షాక్…!

భగవద్గీతపై బిత్తిరి సత్తి చేసిన వీడియో వివాదంలో చిక్కుకుంది. ఆయనపై సైబర్ క్రైం లో కేసు నమోదు అయింది.

  • Written By:
  • Publish Date - August 7, 2024 / 02:00 PM IST

తన వీడియోలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న బిత్తిరి సత్తి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల భగవద్గీతపై బిత్తిరి సత్తి ఒక వీడియో చేసాడు. నెట్టింట ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ తనదైన శైలిలో వ్యంగ్యంగా సత్తి స్కిట్ చేసాడు. స్కిట్ అసభ్యంగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. బిత్తిరి సత్తి చేసిన ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా హిందూ సంఘాలు… అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

వీడియో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియోను తొలగించి హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. తన వీడియోలు హిందువులను కించపరిచేలా లేవని బిత్తిరి సత్తి సమర్ధించుకున్నాడు. బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది రాష్ట్రీయ వానర సేన అనే హిందూ సంఘం. కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తున్నారు.